ఈ-ఆఫీస్‌తో ఎంతో మేలు


Wed,March 20, 2019 01:19 AM

-మీ రాష్ట్రంలో అమలు చేసేందుకు పూర్తిగా సహకరిస్తాం
-కర్టాటక రాష్ట్ర అధికారులు ఈ-ఆఫీస్ సేవలపై ఆరా
-పలు విషయాలను తెలియజేసిన కలెక్టర్ రొనాల్డ్‌రోస్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ఈ-ఆఫీస్ సేవలను ప్రభుత్వ కార్యాలయల్లో అమలు చేయడం వల్ల ఎంతో సులభతరంగా ప్రక్రియ జరుగుతుందని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. మంగళవారం కర్టాటక నుంచి జిల్లా కేంద్రానికి ఈ-ఆఫీస్ అందిస్తున్న సేవల గూర్చి వివరాలు తెలుసుకునేందుకుగాను కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మాట్లాడుతూ జిల్లాలో ఈ-ఆఫీస్ సేవలను 55 కా ర్యాలయల్లో ప్రారంభించి నట్లు తెలిపారు. ఇతర ప్రాం తాల్లో ఉండి ఆఫీస్ కార్యకలాపాలు చేసుకునే వెసులుబాటు కేవలం ఈ-ఆఫీస్‌తోనే సాధ్యమవుతుందని సూచించారు. అవసరమైన సమాచారం అంతా అందించడం జరుగుతుందన్నారు. పారదర్శకంగా తమకు అవసరమైన కార్యాలయాల్లో అమలు చేసుకోవాలని తెలిపారు. సులభతరంగా వేగంగా కార్యాలయాల్లో పనులు ఈ-ఆఫీస్‌తోనే సాధ్యమవుతుందని తెలిపారు. కాగిత రహిత పాలన దిశగా అడుగులు వేయడం జరుగుతుందని, దీంతో సమయం చాలా వృథాకాకుండా ఉండేందుకు అవకాశం ఉం టుందని తెలిపారు. కంప్యూటర్ ద్వారా ప్రత్యేకంగా ఈ-ఆఫీస్ సేవల వినియోగం గూర్చి ప్రత్యేకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కర్టాటక రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ప్రోటోకాల్ ఆఫీసర్ షైన్ ఏ హక్, ఎన్‌ఎస్ అసిస్టెంట్ బినుకుమార్, అధికారులు నారామనదాన్, ఈ-ఆఫీస్ మేనేజర్ శ్రీనివాసాపెండ్యాల, రుషితా, మౌనిక ఉన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...