డబుల్ బెడ్రూం పనుల్లో..వేగం పెంచండి


Mon,March 18, 2019 11:58 PM

హన్వాడ : డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వీ.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హన్వాడ మండల కేంద్రంలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని, లేకపోతే చర్యలు తప్పవన్నారు. మండల కేంద్రంలో ఒక్కో ఇంటికి రూ.5లక్షల 4వేలు వెచ్చించి మొత్తం 80 ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మిగతా గ్రామాల్లో పనులు త్వరితగతిన చేపట్టి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఇండ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఇండ్ల నిర్మాణం పూర్తయితే ఆదర్శ కాలనీగా మారుస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మయ్య, కృష్ణయ్యగౌడ్, ఎంపీటీసీ ఆంజనేయులు నాయకులు బాల్‌రాజ్, అనంతరెడ్డి, కృష్ణయ్యగౌడ్, సత్యం, జంబులయ్య, వెంకటయ్య, అంజి తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ ప్రధాని కావాలన్నదే ప్రజల ఆకాంక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, ఈ మేరకు 70మంది ఎంపీలు మద్దతు ఇస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మండలంలోని నాయినోనిపల్లి గ్రామంలో నూతనంగా చేపట్టిన హనుమాన్ దేవాలయం నిర్మాణంలో భాగంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. మన బతుకులు మారాలంటే తెలంగాణలో ఉన్న ఎంపీ స్థానాల్లో ఇంటి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ రావడం ఖాయమన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కలిసికట్టుగా పని చేయాలని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి మండలంలోని ప్రతి చెరువును నింపి రైతులకు సాగునీటిని అందిస్తామన్నారు. సమావేశంలో సర్పంచ్ చిన్న చెన్నయ్య, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ అనంతరెడ్డి, నాయకులు కృష్ణయ్యగౌడ్, రమణారెడ్డి, శేఖర్, జగదీశ్వర్‌రెడ్డి, శివకుమార్, చెన్నయ్య ఉన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...