ఒట్టేసి ఓటేస్తాను విజయవంతం చేయండి


Mon,March 18, 2019 11:58 PM

నారాయణపేట, నమస్తే తెలంగాణ : నారాయణపేట జిల్లాలో ఒట్టేసి ఓటేస్తా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్‌లో డీఆర్డీఏ, డ్వామా, ఫైర్ అధికారులతో ని ర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కొ త్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలోని అధికారులందరూ కలిసికట్టుగా పని చేస్తే అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తామన్నారు. ప్రధానంగా అన్ని శాఖల అధికారు లు ఫీల్డ్‌వర్క్‌పై దృష్టి సారించాలని సూచించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోకుం డా చూడాలన్నారు. ప్రతి మండలంలో బ్యాంక్ లిం కేజీ ఏర్పాటు చేసుకోవడానికి 150 మంది సభ్యులకు ఉపాధి క ల్పించాలని డ్వామా అధికారుల ను ఆదేశించారు. బ్యాంకు నుంచి రెండు, స్త్రీ నిధి నుంచి రెండు చొ ప్పున బ్యాంకు లింకేజీ ఉన్నాయని, వాటిని ఉపయోగించుకొని పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంలో వెనకబడి ఉన్నారని, అకౌంట్లలో డబ్బులు ఉన్నప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణమెందుకు జరగడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఈ మార్చి 31 నాటికి 20శాతం పనులు జరిగే విధంగా చూడాలన్నారు. జిల్లాలో సదరం క్యాంపుల ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలంలో దాల్‌మిల్లులు, చిన్న రైస్ మిల్లులు ఏర్పాటు కావాలని, ము ఖ్యంగా మార్కెటింగ్ జరిగే విధంగా చూడాలన్నారు. అలాగే, ఎండ తీవ్రతకు ప్రజలు గురికాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై రూపొందించిన పోస్టర్‌లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఓటర్ల జాబితాను సిద్ధం చేయండి
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలించి తుది జాబితాను విడుదల చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. ఈనెల 20 వరకు ఓటర్ల జాబితాను పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఆయా సమావేశాల్లో డీఆర్డీవో రఘువీరారెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భూపాల్‌రెడ్డి, డీఎంహెచ్‌వో సౌభాగ్యలక్ష్మి, ఆర్డీవో శ్రీనివాసులు, ఎం.బాలాజీ సఫారే, డీపీవో పాండు తదితరులు ఉన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...