పారదర్శకంగా ఎన్నికలు


Mon,March 18, 2019 11:58 PM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తారని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీల నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 18 నుంచి 25 వరకు పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్లు స్వీకరణ ఉంటుందన్నారు. అయితే, 21, 23,24 తేదీలు సెలవు రోజులుగా ప్రకటించడం జరిగిందని, ఈ రోజుల్లో నామినేషన్లు స్వీకరించబడవని కలెక్టర్ రాజకీయ పార్టీల నేతలకు సూచించారు. నామినేషన్ల దాఖలు చేయనన్న అభ్యర్థులు రూ.70లక్షలకు మించి ఖర్చు చేయకూడదని, రెండు, మూ డు రోజులకోసారి ఖర్చు ల లెక్కలను తెలియజేయాల్సి ఉంటుందన్నా రు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని కోరా రు. సువిధ, సీ-విజన్ యాప్‌లను రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటీఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లు కూడా ఖరారు చేశామని, ప్రజాప్రతినిధులు అధికారులకు అందుబాటులో ఉండాలన్నారు. ఎక్కడ ఎలాం టి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ క్రాంతి, డీఆర్‌వో కే.స్వర్ణలత, పార్టీల నాయకులు బెక్కెం జనార్ధన్, రంగారావు, సాయిబాబా, సర్దార్, రామ్మోహన్, ఆం జనేయులు తదితరులు ఉన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...