తనిఖీల్లో రూ.పది లక్షలు పట్టివేత


Mon,March 18, 2019 11:57 PM

మహబూబ్‌నగర్ క్రైం/భూత్పూర్: పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ ప్రారంభమైన మొదటి రోజే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు చేపడుతున్న వాహన తనిఖీలో భాగంగా ఓ కారులో రూ.10 లక్షల నగదును ఎలాం టి ఆధారాలు లేకుండా తీసుకెళ్తుండగా పోలీసులు, అధికారులు గుర్తించి రూ.10 లక్షలు స్వాధీనం చేసుకొని మహబూబ్‌నగర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జడ్పీ సీఈవో వసంతకుమారికి అప్పగించి, విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్ తెలిపిన వివరాలు నాగర్‌కర్నూల్ జిల్లాలోని పోతిరెడ్డిపల్లి రిజర్వాయర్ కంపెనీకి చెందిన నిర్వాహకులు సోమవారం సాయంత్రం కంపెనీ కాంట్రాక్టర్ సందీప్‌తో పాటు కారులో రూ.10 లక్ష లు తీసుకొని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో భూత్పూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనిఖీని గమనించిన కాంట్రాక్టర్ సందీప్, డ్రైవర్ కారు వెనక్కి తీసుకొని వెళ్లి మళ్లీ 20 నిమిషాల తర్వాత తిరిగి వస్తుండగా పోలీసులు కారును గు ర్తించి, కారులో ఉన్న మరో వ్యక్తి ఎక్కడని ఆరాతీయగా అ తను బస్సులో వెళ్లాడని డ్రైవర్ తెలపడంతో పోలీసులు అత ని సహాయంతో జిల్లా కేంద్రంలోని పాల్కొండ సాయిబాబ ఆలయం వద్ద ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి సందీప్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని బ్యాగ్ తనిఖీ చేయగా అం దులో రూ.10లక్షలు బయట పడ్డాయి. ఈ మేరకు పోలీసు లు సందీప్, కారు డ్రైవర్‌తోపాటు రూ.10 లక్షలు స్వాధీనం చేసుకుని రిటర్నింగ్ అధికారులకు అప్పగించగా వారు జిల్లాపరిషత్‌లోని జడ్పీ సీఈవో వసంతకుమారి దగ్గర విచారణ చేపట్టి, డబ్బుకు గల ఆధారాలు ఉంటే పరిశీలించి డబ్బు తిరిగి ఇస్తామని ఆమె తెలిపారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...