ఆస్తి పన్ను@81శాతం


Mon,March 18, 2019 11:57 PM

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : పురపాలిక సంఘంలో ఆస్తిపన్ను వసూలు వేగవంతమైంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 13 రోజుల గడువే ఉండడంతో పన్ను వసూళ్లను అధికారులు వేగవంతం చేశారు. ప్రత్యేక బృం దాలు ప్రతి వార్డులో పర్యటించి పన్ను వసూలు చేపడుతున్నారు. సోమవారం నాటికి పురపాలిక సంఘంలో 81శాతం ఆస్తిపన్ను వసూలైంది. మిగిలిన పన్ను వసూలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్థిక సంవత్సరం ముగింపులోగా వందశాతం పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పురపాలిక సంఘంలో రూ.12కోట్లకుపైగా ఆస్తిపన్ను వసూలైంది. ఇంకా రూ.2కోట్ల 20లక్షల మేర ట్యాక్స్ వసూలు కావాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాకు సంబంధించి రూ.4కోట్ల 57లక్షలు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.25లక్షల 31వేలు వసూలు చేశారు. మరో రూ.4కోట్ల 27లక్షలు వసూలు కావాల్సి ఉంది.

నల్లా బిల్లులకు సంబంధించి పురపాలిక సంఘానికి రూ.3కోట్ల 89ల క్షల 74వేల ఆదాయం రావాల్సి ఉండగా, ఇందులో ఇప్పటి వరకు రూ.90లక్షల 60వేలు మాత్రమే వసూలు చేశారు. ఇంకా రూ.2కోట్లకుపైగా వసూలు కావాల్సి ఉంది. కాగా, ఆస్తిపన్ను, నల్లా బిల్లు చెల్లించని వారిపై మున్సిపల్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేయడంతోపాటు, నల్లా కనెక్షన్ తొలగింపు, దుకాణాలకు తాళాలు వేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఏదేమైనప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు సమీపిస్తుండడంతో పురపాలిక సంఘం లో ఆస్తిపన్ను, నల్లా బిల్లుల వసూలును వేగవంతమైంది. పట్టణ ప్రజలు ఆస్తిపన్ను చెల్లించి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...