ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి


Mon,March 18, 2019 11:56 PM

-పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు..
-వికలాంగుల సౌకర్యార్థం ర్యాంపుల నిర్మాణాలు పూర్తి చేయండి
-జిల్లా రెవెన్యూ అధికారి స్వర్ణలత
-పార్లమెంట్ ఎన్నికలపై జిల్లాలోని అధికారులతో సమీక్ష
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా అధికారులు పోలింగ్‌స్టేషన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుస్తుగా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కే.స్వర్ణలత సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమవేశ మందిరంలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, మున్సిపాల్టీ, ఇన్‌ప్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లకు సంబంధించిన సూపరింటెండెంట్ల ఇంజినీర్లు, ఎక్సిక్యూటివ్ ఇంజినీర్లు, డివిజినల్ ఇంజినీర్లతో సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో దివ్యాంగులు ఉన్న పోలింగ కేంద్రాల్లో ర్యాంపుల ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఏఏ చోట ఎంత వరకు నిర్మాణాలు పూర్తయాయి. పూర్తి కాని వాటిని మరింత వేగంగా నిర్మించేందుకు సంబంధింత అధికారులు దృష్టి సారించాలని తెలియజేశారు. పెండింగ్‌లో ఉన్న వాటిని వాకబు చేసి, పెండింగులో ఉన్న వాటిని పూర్తి చేసి నివేదికలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో టాయిలెట్లు, మహిళలకు, పురుషులకు విడివిడిగా ఏర్పాటు చేయాలన్నారు. రక్షిత తాగునీరు, ప్లగ్ పాయింట్, ఎలక్ట్రిసిటి తదితర సౌకార్యలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. నిరంతర వాటర్ సరఫరా లేని ప్రాంతాల్లో సిమెంట్ తొట్టిలు ఏర్పాటు చేయాలని, దివ్యాంగులకు వీల్‌చైర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ప్రేమ్‌రాజ్, సంబంధింత అధికారులు ఉన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...