బైఫాస్ట్!


Mon,March 18, 2019 02:03 AM

-బైపాస్ రోడ్డు నిర్మాణం ముమ్మరం
-భూసేకరణకుప్రభుత్వం ప్రత్యేక చర్యలు
-రూ.96.7కోట్లతో బైపాస్ నిర్మాణం
-త్వరితగతిన పూర్తి చేస్తాం
-మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పాలమూరు ప్రజ ల చిరకాల ఆకాంక్ష అయిన బైపాస్ రోడ్డు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వీర్యమైన బైపాస్ రోడ్డు కల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సాకారమవుతోంది. బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే పాలమూరుకు కొత్త శోభ సంతరించుకోనున్నది. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి పాలమూరు యూనివర్సిటీ వరకు 9.05 కిలోమీటర్ల మేర చేపట్టిన రోడ్డు నిర్మాణం చురుకుగా సాగుతున్నది. పనుల పురోగతిపై రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక దృష్టి సారిస్తూ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

రూ.96.7 కోట్లతో నిర్మాణం..
జిల్లా కేంద్రంలో ఏకైక ప్రధాన రోడ్డు ఉండడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో వాహన చోధకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత పాలకులు బైపాస్ రోడ్డు నిర్మాణం అప్పుడు, ఇప్పుడు అంటూ కలం వెల్లదీశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషితో అనతి కాలంలోనే మహబూబ్‌నగర్ అభివృద్ధి వేగవంతమైంది. జిల్లా కేంద్రంలో ప్రధాన సమస్య పరిష్కారం కోసం రూ.96.7 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. బైపాస్ రోడ్డు పనులు పూర్తయితే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం మరింత విస్తరించడమే కాకుండా రవాణా సౌ కర్యం మెరుగవనున్నది.

రోడ్డు విస్తరణకు రూ.51.46 కోట్లు..
బైపాస్ రోడ్డు విస్తరణకు ఆర్‌అండ్‌బీ అధికారులు రూ.51.46 కోట్లు అవసరమవుతాయని అంచనాలతో రో డ్డు నిర్మాణాన్ని సంబంధిత కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఈ రోడ్డును 9.5 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. ఇప్ప టి వరకు సింహభాగం పనుల ప్రక్రియ ప్రారంభమై ముమ్మరంగా సాగుతున్నాయి. హౌసింగ్ బోర్డు దగ్గరున్న ప్రధాన రోడ్డు నుంచి క్రిస్టియన్‌పల్లి ప్రధాన రోడ్డు వరకు ఉన్న 5.1 కిలోమీటర్ల దూరం బైపాస్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆర్‌అండ్‌బీ పరిధిలోని రోడ్డు నిర్మాణానికి సంబంధించి రూ.5 కోట్లు మంజూరయ్యాయి. ఆయా పనులను ముమ్మరంగా చేపట్టేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

భూ సేకరణకు ప్రాధాన్యత..
బైపాస్ రోడ్డుకు అవసరమైన భూసేకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రోడ్డు విస్తరణలో భూములు కో ల్పోతున్న వారికి సంతృప్తికరమైన నష్ట పరిహారం అందించి పనులను వేగవంతం చేసింది. భూసేకరణకు ఎలాంటి ఇ బ్బందులు ఏర్పడకుండా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చర్యలు తీ సుకుంటున్నారు. రూ.31.30 కోట్లకుపైగా భూసేకరణకు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఏదేమైనప్పటికీ బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే మహబూబ్‌నగర్ మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా ప్రజలు ఆ నందం వ్యక్తం చేస్తున్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...