ఎన్నికల అధికారులకు శిక్షణ


Mon,March 18, 2019 02:02 AM

-శిక్షణను పరిశీలించిన ఎన్నికల ప్రత్యేకాధికారి క్రాంతి
జడ్చర్ల టౌన్ : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆదివారం పీవో, ఏపీవోలకు జడ్చర్ల డాక్టర్ బీ ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్, ఎన్నికల ప్రత్యేక అధికారిణి క్రాంతి ఐఏఎస్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె ఎన్నికల అధికారులకు ఎన్నికల విధులు, తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలలో భాగంగా నిర్వహించే ఓ టింగ్ సమయంలో పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పో లింగ్ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సెక్టోరియల్ అధికారులు శిక్షణ ఇచ్చారు. కంట్రోల్ యూనిట్, వీవీ పాట్, వీఎస్‌డీయూలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సారి ఓటింగ్ సమయంలో కంట్రోల్ యూనిట్‌తో పాటు వీడీఎస్‌ను కొత్తగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ రెండింటిని ఎన్నికల సమయంలో ఓటర్లు ఓట్లు వేసే ప్రక్రియను ఓటు వేశారా లేదా అన్న విషయాలను పోలింగ్ అధికారులు ఎప్పుడు చూడటానికి వీలుగా కొత్తగా వీడిఎస్‌యూను ఏర్పా టు చేస్తున్నట్లు వివరించారు. అదే విధంగా ఈడీసీ(ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్)లు కలిగిన ఎన్నికల సిబ్బందికి ఆయా పోలింగ్ కేంద్రాలలో ఓటు ఎలా ఇవ్వాలనే విషయాలను తెలిపారు. ఈ సారి ఎన్నికల సిబ్బంది తమ ఓటును వినియోగించుకోవడానికి గాను ఈడీసీని ఇస్తున్నారు. దాని ద్వారా వారు ఓటును వినియోగించుకోవచ్చన్నారు. పోలింగ్ అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం అన్నింటినీ పూర్తిగా తొలగించాలని సూచించారు. ఈ సందర్భంగా సెక్టోరియల్ అధికారులతో ప్రత్యేకాధికారి క్రాంతి సమావేశం నిర్వహించి వారు పోలింగ్ బూత్‌ల దగ్గర ఏర్పా ట్లు ఎలా చేస్తున్నారు, అక్కడి సౌకర్యాలపై ఆమె అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్చర్ల తహసీల్దార్, ఏఈఆర్‌వో శ్రీనివాస్‌రెడ్డి, డీటీలు శ్రీనివాస్, వెంకటేశ్వ రి, కృష్ణ, ఆర్‌ఐలు సుదర్శన్‌రెడ్డి, రాఘవేం ద్ర, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...