నిర్లక్ష్యం వద్దు


Mon,March 18, 2019 02:02 AM

-ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు
-నారాయణపేట కలెక్టర్ వెంకట్రావు
మక్తల్, నమస్తే తెలంగాణ/నారాయణపేట టౌన్ : పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వి ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని నారాయణ జిల్లా కలెక్టర్ వెంకట్రావు సూచించారు. నారాయణపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈవీఎం, వీవీప్యాట్‌ల పనితీరు, ఎన్నికల విధులపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడా రు. పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా ని ర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సి బ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీ సుకురావాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన చిన్నచిన్న పొరపాట్లను సరి చేసుకొని పార్లమెంట్ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల కమీషన్ నిబంధనలకు అనుగుణం గా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది నడుచుకోవాలన్నారు.

ఎన్నికల కమీషన్ నుంచి వచ్చిన ఆదేశాలు, నివేదికలను తప్పనిసరిగా నిర్ణీత సమయంలో అందజేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తించాలని, తప్పులకు ఆస్కారమిస్తే చర్యలు తప్పవన్నారు. పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్‌కు బదులుగా ఈడీసీ (ఎంప్లాయీస్ డ్యూటీ సర్టిఫికేట్ ) ద్వారా విధులు నిర్వర్తిస్తున్న పోలింగ్ కేంద్రంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం శిక్షణ తరగతుల్లో భాగంగా అధికారులచే సెక్టోరియల్, పీవో, ఏపీవోలకు ఈవీఎం, వీవీ ప్యాట్‌ల అమరిక, పనితీరుపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, మక్తల్ తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్లు సురేశ్, కాలప్ప, ఆర్‌ఐ మధన్మోహన్‌రెడ్డి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ అంతరాయంతో ఆలస్యమైన శిక్షణా తరగతులు..
నారాయణపేటలో పీవోలు, ఏపీవోలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు శిక్షణా తరగతులు కొనసాగాల్సి ఉండగా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో శిక్షణా తరగతులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. 11.30 గంటల నుంచి ఈవీఎం, వీవీప్యాట్‌ల పనితీరుపై ప్రొజెక్టర్ ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించారు. అలాగే, సిబ్బంది 12 గంటల సమయం వరకు కూడా ఒక్కొక్కరూ వస్తుండడం, తరగతులకు హాజరైన కొంతమంది సిబ్బంది మధ్యలోనే వెళ్లిపోవడాన్ని గమనించిన ఆర్డీవో శ్రీనివాసులు ఆవరణలో ఉన్న గేట్లను మూసివేయించి బయటకు ఎవరూ వెళ్లకుండా చూడాలని తహసీల్దార్ రాజును ఆదేశించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...