ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి


Mon,March 18, 2019 02:01 AM

-నియమ నిబంధనలను పక్కాగా అమలు చేయాలి
-మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళశాల, బాలికల కళాశాలల్లో పీవోలు, ఏపీవోలకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల నియమ నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు స్వీకరించినప్పటి నుంచి పోలింగ్ ముగిసేవరకు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. ఎన్నికల విధులకు బయలుదేరే ముందు పంపిణీ కేంద్రంలోనే తమ పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన ఓటర్ల వివరాలతోపాటు పూర్తి విషయాలను తెలుసుకోవాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలోనూ ఎలాంటి ఇబ్బందలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత అధికారులను అడిగి తెలసుకోవాలని, సందేహాలతో ఎన్నికల ప్రక్రియలో ఉండకూడదని తెలిపారు. కార్యక్రమంలో పీవోలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...