రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం లక్ష్యం


Mon,March 18, 2019 02:01 AM

-వివాదరహిత గ్రామాలుగా ఉండాలి
-వర్గాలుగా విడిపోకుండా కలిసికట్టుగా ఉందాం
-16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుందాం
-మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి అర్బన్ : తెలంగాణ సమగ్రాభివృద్ధే సీ ఎం కేసీఆర్ లక్ష్యమని, అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలని, ప్రపంచానికి ఆదర్శం గా ఉండాలన్నాదే ఆయన ఆలోచన అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్‌హాల్‌లో గోపాల్‌పేట, రేవల్లి, వ నపర్తి మండలాల నాయకులతో సమావూశమై పార్లమెంటరీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయానికి ప లు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు పార్టీలుగా, వర్గాలుగా కాకుండా ఏకతాటి మీద ఉండాలని, అభివృద్ధి కోసం ప్రజలం తా ఒక్కటిగా పనిచేయాలని, 60 ఏళ్లు ఆగమైన తెలంగాణ ఇంకా ఆగం కాకూడదన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. ఎక్కడి తెలంగాణ అని ఎక్కిరిచ్చిన వారి ఊహకు అందకుండా తె లంగాణ ప్రజలను కూడగట్టుకుని రాష్ర్టాన్ని సా ధించి ఈ రోజు ఎవరికీ అందనంత ఎత్తులో కేసీఆర్ నిలిచారని గుర్తు చేశారు. అనేక పార్టీలను ఒప్పించి తెలంగాణ సాధించామని, ఆంధ్రా పా ర్టీలు గ్రామాలను విడదీసి విద్వేషాలను పెంచార ని, ఇక ముందు వివాదరహిత గ్రామాలు తెలంగాణలో ఉండాలని, గ్రామ అభివృద్ధి కోసం ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో 280 బూతులలో 274 బూతులలో టీఆర్‌ఎస్‌కు మెజార్టీ వచ్చిందని, ఈ సారి మిగిలిన వాటిలో కూడా మెజార్టీ రావాలని సూ చించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మ య్య, ఎంపీపీలు శంకర్‌నాయక్, జానకిరాంరెడ్డి, కౌన్సిలర్లు గట్టుయాదవ్, శ్రీధర్, తిరుమల్, కృష్ణయ్య, మాజీ కౌన్సిలర్ లోక్‌నాథ్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...