ఉప్పాంగిన అభిమానం


Sun,March 17, 2019 01:24 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ప్రజా సంక్షే మం కోసం నిరంతరం పరితపించే అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, టూరిజం, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వీ.శ్రీనివాస్‌గౌడ్‌పై ప్రజా అభిమానం ఉప్పొంగింది. శీనన్న మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటి జన్మదిన వేడుకలు జిల్లా కేం ద్రంలో శనివారం అంబరాన్నంటాయి. మంత్రి శ్రీ నివాస్‌గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు పోటీ పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మంత్రి శీనన్న జన్మదిన వేడుకలతో జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణం కనిపించింది. ముందుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన తల్లిదండ్రులు శాంతమ్మ, నారాయణగౌడ్‌ల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో కుంటుబ సభ్యులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.

కాగా, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి శ్రీని వాస్‌గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హై దరాబాద్‌లో పూలబొకే అందజేసి పుట్టిన రోజు శు భాకాంక్షలు తెలియజేశారు.అలాగే, ఏనుగొండలోని అ నాథాశ్రమ విద్యార్థుల సమక్షంలో మంత్రి శ్రీనివాస్‌గౌ డ్ కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే, అప్పన్నపల్లి దగ్గర శ్రీబాలాజీ టైలరింగ్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అలాగే, జిల్లా కేంద్రంలోని శాంతివన్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శాంతివన్‌లోని దివ్యాంగులు, విద్యార్థుల మధ్య మంత్రి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో రె డ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్, శ్యామూల్, జగపతిరావు, టీఆర్‌ఎస్ నాయకులు బెక్కెం జనార్దన్, విష్ణు జనార్దన్, మంజుల, రమణయ్య, రంగినేని శారద, ప్ర భాకర్, కౌన్సిలర్ వనజ, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

పార్టీ కార్యాలయంలో..
జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో మం త్రి శ్రీనివాస్‌గౌడ్ జన్మదిన వేడుకలు పెద్దఎత్తున హాజరైన పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. మంత్రికి సత్కరించి శుభాకాంక్షలు తె లిపేందుకు పోటీ పడ్డారు. మంత్రి శ్రీనివాస్‌గౌ డ్ శాంతికి చిహ్నంగా శాంతికపోతం ఎగరవేశారు. అనంతరం భారీ కేక్‌ను అభిమానుల సమక్షంలో మంత్రి కట్ చేశారు. పలువురు మత పెద్దలు మంత్రిని ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, వైస్ చైర్మన్ రాములు, జేపీఎన్‌సీఈ కళాశాల చైర్మన్ కేఎస్.రవికుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ కోరమోని వెంకటయ్య, భూత్పూర్ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కదిరె శేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు బెక్కెం జనార్ధన్, అమరేందర్, గోపాల్‌యాదవ్, పెద్ద విజయ్‌కుమార్, కృష్ణ ముదిరాజ్, పాస్టర్ రెవరెండ్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...