సైనికులకు అండగా నిలవాలి


Sat,February 23, 2019 01:56 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ (గండీడ్) : భారత సైనికులకు ప్రతి భారతీయుడు అండగా నిలవాలని ఢిల్లీకి చెందిన యువకుడు ఆప్తాబ్ ఫరీద్ అన్నారు. సైనిక కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరుతూ ఢిల్లీ నుంచి ఆప్తాబ్ ఫరీద్ చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం గండీడ్ మండలం మహ్మదాబాద్‌కు చేరింది. మహ్మదాబాద్ పోలీసులు ఢిల్లీ యువకుడికి స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఫరీద్ మాట్లాడుతూ దేశ ప్రజల రక్షణ కోసం సరిహద్దులో సైనికులు కాపలా కాస్తూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తీవ్రవాదులతో పోరాడుతున్నారని తెలిపారు. దేశ సరిహద్దుల నుంచి తీవ్రవాదులను పారద్రోలే వరకు ప్రతి యువకుడు సైనికుడు కావాలన్నారు. గత సంవత్సరం ఆగస్టు 26న తాను చేపట్టిన సైకిల్ యాత్ర నేటి వరకు 17,230 కిలో మీటర్లు సాగిందని తెలిపారు. ఈ యాత్రను తన పుట్టిన రోజైన జూన్ 15న ముగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మహ్మదాబాద్ పోలీసులు సలీం, గోపాల్, ప్రవీణ్, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...