కల్తీ చేస్తే కఠిన చర్యలు


Wed,February 20, 2019 01:37 AM

జడ్చర్ల రూరల్ : ఆహారాన్ని కల్తిచేస్తే కఠిన చర్యలు తప్పవని ఆహార భద్రత రాష్ట్ర నోడల్ అధికారి, ఉమ్మడి జిల్లా అధికారి అశోక్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం జడ్చర్ల పట్టణంలోని పలు హోటళ్లు, టీఫిన్ సెంటర్లు, దాబాలపై ఉమ్మడి జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారి ధర్మేందర్‌తో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశానుసారంగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జడ్చర్ల కొత్తబస్టాండ్ సమీపంలో ఉన్న కొన్ని టీఫీన్ సెంటర్లతో పాటు దాబాలు, హోటళ్లల్లో ఆహార పదర్థాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా పలు హోటళ్లు వంట గదులలో పరిశువూభతను పాటించడం లేదని తద్వారా తినుబండారాలు తీసుకునే వారికి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వ్యాపారులు తప్పకుండా పరిశువూభత పాటించాలని అలాగే వండిన భోజనం, ఇతర ఆహార పదర్థాలు కాని ఎక్కువ సేపు రిఫ్రిజ్‌రేటర్లలో భద్ర పరచరాదన్నారు. ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలలో, హోటల్స్‌లో వేపుడు నిర్వహించేటప్పుడు నాణ్యమైన నూనే వాడాలని సూచించారు. అనంతరం కొత్తబస్టాండ్ సమీపంలోని రెండు టిఫిన్ సెంటర్లతో పాటు ఒక హోటల్‌లో ఆహర పదర్థాల శ్యాంపిల్స్ తీసుకుని వారికి నోటీసులు అందజేశారు. ముఖ్యంగా వ్యాపారం నిర్వహించాలంటే లైసెన్స్ తీసుకోవాలన్నారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. మొదటి సారి హెచ్చరించడం జరుగుతుంది. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీలలో జిల్లా అధికారులు, సిబ్బంది అంజిలయ్య, వాజీద్ తదితరులు ఉన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...