అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరిక..


Tue,February 19, 2019 02:14 AM

-దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి
భూత్పూర్ : రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బోరింగ్‌నర్సింహులుతో పాటు 20మంది, తాటిపర్తి మాజీ సర్పంచ్ బాలస్వామి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖీద్‌తో పాటు మరో పది మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తగా చేరిన వారు పాత నాయకులతో కలిసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అందరికీ పదవులు రావాలంటే కొంత కాలం పార్టీకి పనిచేయాలన్నారు. చేరిన వారిలో గ్రంథాలయ కమిటీ మాజీ చైర్మన్ సత్తూర్‌కృష్ణయ్యగౌడ్, శంకర్, చెన్నయ్య, శ్రీను, బాలగాళ్ల నర్సింహులు, రమేశ్ తదితరులు ఉన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...