ఉడ్ షాపును సీజ్ చేసిన అటవీ అధికారులు


Tue,February 19, 2019 02:13 AM

జడ్చర్ల టౌన్ : జడ్చర్లలో అటవీశాఖకు సంబంధించి ఎటువంటి అనుమతు లు లేకుండా నడుపుతున్న శ్రీ బాలాజీ రెడిమేడ్ ఉడ్‌షాపును సోమవారం అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రయ్య ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు శ్రీ బాలాజీ రెడిమేడ్ ఉడ్‌షాపును సోమవారం తనిఖీ చేయగా ఈ షాపులో కలప అమ్మకానికి సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు లేవని, అదే విధంగా గ్రామ పంచాయతీ అనుమతితో పాటు జీఎస్‌టీకి సంబందించిన పత్రాలు కూడా లేకపోవడంతో వారు ఆ షాప్‌ను సీజ్ చేశారు. ఈ షాపులో అనుమతి లేకుండా వేప, తుమ్మ కలపకు చెందిన బాజులు, కిటీకీలు, తదితర వస్తువులను తయారు చేసే కలప ఉండటంతో వారు షాపును సీజ్ చేశారు. ఈ దాడులలో స్పెషల్ పార్టీ ఫారెస్ట్ సెక్షన్ అధికారులు నరేందర్, రజనీకాంత్, ఎఫ్‌ఎస్‌వోలు కురుమూర్తి, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...