పాతకక్షలకు ఇద్దరి బలి


Tue,February 19, 2019 02:13 AM

నవాబ్‌పేట : గ్రామంలో గత కొంతకాలం క్రితం ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న చిన్నపాటి తగాదాలు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాయి. ఒకరిపై ఒకరు కోపం పెంచుకొని చివరికి ఇద్దరూ ప్రాణాలు విడిచిన ఘటన సోమవారం మండలంలోని పోమాల గ్రా మం లో చోటు చేసుకుంది. ఎస్సై శివకుమార్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పో మాల గ్రామానికి చెందిన పిడుగు వెంకటయ్య(35)పై అదే గ్రామానికి చెందిన కామారం యాదయ్య పాతకక్షల నెపంతో పెట్రోల్‌పోసి నిప్పిటించి హత్య చేసినట్లు తెలిపారు. వెంకటయ్య మృతి చెందడంతో శిక్ష తనపై పడుతందనే భయంతో కామారం యాదయ్య కూడా చెట్టు కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపా రు. పిడుగు వెంకటయ్య, కామారం యాదయ్య పో మాలలోని ఒకే కాలనీలో గల పక్కపక్క ఇంటిలోనే ఉం టారు. కాగా ఇద్దరి మధ్య గత కొంతకాలం నుంచి పా తకక్షలు ఉన్నట్లు ఎస్సై శివకుమార్ పేర్కొన్నారు. దీంతో వెంకటయ్యపై కోపం పెంచుకున్న యాదయ్య ఆదివారం నాడు రాత్రి వెంకటయ్య తన వ్యవసాయ పొ లం నుంచి గేదెలకు పాలుపిండుకొని ద్విచక్రవాహనం పై ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో కాపుకాసి వెంకటయ్యపై పెట్రోల్‌తో దాడి చేసినట్లు చెప్పారు. వెంకటయ్యతో పాటు అతడి ద్విచక్రవాహనంపై కూడా పెట్రోల్ పోసి నిప్పంటించడంతో వెంకటయ్య తీవ్రగాయాల పాలుకాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకి తరలించగా అక్కడ చికిత్స పొందూతూ సోమవారం ఉదయం వెంకటయ్య మృతి చెందారు. వెంకటయ్య చనిపోయిన విషయం యాదయ్యకు తెలియడంతో తీవ్రభయాందోళనకు గురై నింద నాపై పడుతుందని శిక్షిస్తారనే ఆందోళనతో గ్రామ సమీపంలో గల మర్రిచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. వెంకటయ్యకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఎస్సై తెలిపారు. కాగా యాద య్య భార్య గత నెల రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఒకే గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో పోమాలలో విషాద ఛాయ లు అలుముకున్నాయి. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...