జిల్లాతో ఆత్మీయ అనుబంధం


Tue,February 19, 2019 02:13 AM

-జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరేకృష్ణ భూపతి
మహబూబ్‌నగర్ లీగల్ : మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేయడం వల్ల జిల్లాతో ఆత్మీయ అనుబంధం నెలకొందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి హరేకృష్ణభూపతి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయన జ్యుడీషియల్ అకాడమీ కి అదనపు డైరక్టర్‌గా బదిలీ అయ్యారు. జ్యుడీషియల్ అకాడమీ అదనపు డైరక్టర్‌గా ఉన్న జీ.వీ. సుబ్రమణ్యం మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇక్కడకు వస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా బార్ అసోసియేషన్ భవనంలో వీడ్కోల సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడు తూ మహబూబ్‌నగర్ జిల్లాతో ఇక్కడ పనిచేసినంత ఇక్కడి ప్రజ లు, న్యాయవాదులు ప్రతి ఒక్కరు సహకారం అందించారని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ న్యాయవాదులు మాట్లాడారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తిని సత్కరించి, మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు అజిత్‌సింహారావు, జిల్లా మొ దటి అదనపు కోర్టు న్యాయమూర్తి రఘురాంలతోపాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీరాంకుమార్, ఉపాధ్యక్షుడు వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...