మహిళలపై దాడులు చేస్తే సహించం


Thu,September 13, 2018 01:29 AM

కోడేరు : జిల్లాలో బాలికలు, మహిళలపై లైంగిక దాడులతో పాటు ఇతర భౌతిక దా డులు చేస్తే సహించేది లేదని జిల్లా షీ టీం ఇన్‌చార్జి వెంకటయ్య పేర్కొన్నారు. మం డల కేంద్రమైన కోడేరులోని మోడల్ పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బు ధవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన వెంకట య్య మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ డీ ఎస్పీ పర్య వేక్షణలో మూడు షీటీం బృం దాలు పని చేస్తున్నాయన్నారు. మహిళలు బాలికలు యువతులు విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తమ బృందం నాగర్‌కర్నూల్ కొల్లాపూర్ ప్రాంతాల్లో పర్యటిస్తుండగా మరో రెండు బృందాలు అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. మహిళలు, బాలికలను వేధింపులకు గురవుతు న్న వారి కోసం షీటీం బృందం ప్రత్యేకం గా వాట్సఫ్ గ్రూప్ నెంబర్ 790 10 99466 అందుబాటులో ఉంచామన్నా రు. బాధితులు ఎవరైనా సరే వాట్సఫ్ ద్వారా తమకు సమాచారం అంది స్తే తల్లిదండ్రులు, ఉపాద్యాయులకు ఎవరికీ తె లియకుండానే సదరు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఫి ర్యాదు చేసిన బాధితురాలి పూర్తి వివరా లు కూడా గోప్యం ఉంచుతామని, ఈ అ వకాశాన్ని మహిళలు, బాలికలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం మహిళలకు సంబంధించి చ ట్టాలను తెలిపి పోస్టర్లను ఆయన విడుద ల చేశారు. కార్యక్రమంలో షీ టీం సభ్యులు నీలిమ, మల్లేశ్, కళాశాల ప్రిన్సిపాల్ ఉమెఅస్త్ర, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీధర్‌బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...