ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యం : చిట్టెం


Thu,September 13, 2018 01:25 AM

ఊట్కూర్ : పార్టీ అభివృద్ధికి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత ఉంటుందని తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ మొట్కార్ బాల్‌రెడ్డి తన ప్రధాన అనుచరులు జగదీశ్, నాసీర్‌ఖాన్, బాబు టైలర్, మల్లికార్జున్ లతో పాటు 150 మంది యువకులు, మహిళలతో టీడీపీని వీడి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. దివంగత మాజీ మంత్రి ఎల్కోటి ఎల్లారెడ్డి కుటుంబంపై తమ కుటుంబానికి ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయని కుమారులు మనసు మార్చుకుని తమతో కలిసి రావాలని, పార్టీలో తగిన ప్రాధాన్యతను కల్పిస్తామని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సూర్యప్రకాశ్‌రెడ్డి, ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, మార్కెట్ చైర్మన్ నర్సింహాగౌడ్ జెడ్పీటీసీ వెంకట్రామారెడ్డి, అరవింద్‌కుమార్, సుధాకర్‌రెడ్డి, టప్పా శంకరప్ప, లకా్ష్మరెడ్డి, శివరామరాజు, కృష్ణార్జున్‌రెడ్డి, గోవిందప్ప, భీంరెడ్డి, విజయ భాస్కర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వడ్ల మోనప్ప, తదితరులు పాల్గొన్నారు.

158
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...