త్వరలో విద్యుత్ శాఖలో ..


Thu,September 13, 2018 01:25 AM

మహబూబ్‌నగర్ క్లాక్‌టవర్ : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న జేఎల్‌ఎం, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని విద్యుత్ శాఖ సీఎండీ రఘుమారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భోజన విరామ సమయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రాన్స్‌కో ఒక జేఎల్‌ఎంకు సంబంధించి కేసు కోర్టులో ఉండడంతో జేఎల్‌ఎం పోస్టుల భర్తీలో ఆలస్యం జరిగిందన్నారు. ఇప్పటికే జేఎల్‌ఎం పోస్టులు మంజూరు అయ్యాయని, భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిందని, కొత్త పోస్టులు అన్ని కలిపి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.

వచ్చే రెండు రెండు నెలలో రైతులకు ట్రాన్స్‌ఫ్రార్మర్లు అందించాలని, పెండింగ్‌లో ఉండవద్దని, ఇప్పటి వరకు 40 వేల ట్రాన్స్‌ఫార్మర్లు పంపిణీ చేశామని చెప్పారు. అలాగే దీన్‌దయాళ్ యోజన పథకం కింద కరెంటు సరఫరా లేని ఇళ్లను గుర్తించి ఆ ఇంటికి కరెంటు సరఫరా అయ్యే విధంగా అధికారులందరూ కృషి చేయాలని కోరారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు తెల్లరేషన్ కార్డులు ఉన్న వారికి ఉచిత కరెంటు ఇస్తుందన్నారు. ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 80వేల దరఖాస్తులు వచ్చాయని, అందులో 2 లక్షల పైచిలుకు అర్హత పొందారని, ఇప్పటి వరకు లక్షా 20వేల మందికి వినియోగదారులకు అందజేశామన్నారు. అలాగే గణేశ్ మంటపాల దగ్గర విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చిన పట్టిక ప్రకారం డబ్బులు ఇచ్చి కనెక్షన్లు తీసుకోవాలన్నారు. ప్రతి మంటపం వద్ద మీటరు బోర్డు, ఎంసీబీ ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే నిమజ్జనప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సిబ్బంది, అధికారులు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ డైరెక్టర్లు శ్రీనివాసులు, శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎస్‌ఈ రాముడుతోపాటు ఆయా డివిజన్ల డీఈలు, ఏఈడీలు, ఏఈలు పాల్గొన్నారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...