ఈవీఎంలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి


Wed,September 12, 2018 01:22 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ఎన్నికల కమీషన్ పంపించే ప్రతి ఈవీఎంను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్ర అధికారుల ఆదేశం మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలోని ప్రత్యేక భవనంలో భద్రపర్చిన ఈవీఎం మిషన్ల తరలింపును మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. అధికారులు సూచించిన చిరునామాకు ఈవీఎం మిషన్లను పకడ్బందీగా తరలించాలని తెలిపారు. ఈవీఎం మిషన్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంపై నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే జిల్లాకు కొత్త మిషన్లు వస్తాయని, పాత మిషన్లను వెంటనే పూర్తిస్థాయిలో తరలించాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఎస్.వెంకట్రావు, తహసీల్దార్ ప్రభాకర్‌రావు, కలెక్టరేట్ ఏవో ప్రేంరాజ్, రమేశ్ తదితరులు ఉన్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...