కర్తవ్య నిర్వహణే లక్ష్యం


Wed,September 12, 2018 01:22 AM

-అటవీ శాఖ జిల్లా అధికారి గంగారెడ్డి
-ఘనంగా అటవీ అమరుల దినోత్సవం
-నివాళులర్పించిన కలెక్టర్
మహబూబ్‌నగర్ టౌన్ : కర్తవ్య నిర్వహణే అట వీ శాఖ ఉద్యోగుల లక్ష్యమని అటవీ శాఖ జిల్లా అ ధికారి గంగారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించిన అటవీ అమరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమరుల స్థూపానికి డీఎఫ్‌వోతోపాటు, జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రంలో 21 మంది అటవీ సి బ్బంది అమరులవ్వగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు అటవీ సిబ్బంది చనిపోయారన్నా రు. అటవీ సంరక్షణే ధ్యేయంగా సిబ్బంది, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని చెప్పా రు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత హరితహారం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. వన్యప్రాణులు, అటవీ, మొక్కలు, నర్సరీల సంరక్షణ వంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. రక్తదాన శిబిరంలో అటవీ శాఖ ఉద్యోగులు 12 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. అంతకుముందు నిర్వహించిన ర్యాలీని డీఎఫ్‌వో జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్పీ సాయిమనోహర్, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, అ టవీ శాఖ రేంజర్‌లు, ఫారెస్టు బీట్ అధికారులు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...