రైతు కుటుంబానికి బాండు అందజేత


Wed,September 12, 2018 01:21 AM

కొత్తకోట రూరల్ : మండలంలోని ముమ్మల్లెపల్లికి చెందిన రైతు అడ్డాకుల శంకరయ్య(47)ఇటీవల ఆకస్మికంగా మృతి చెందాడు. మృతుడి పేరున రెండు ఎకరా ల భూమి ఉండడంతో ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ నాయకులు వ్యవసాయాధికారులను కలిసి రైతు కుటుంబానికి రైతు బీమా బాం డును ఇప్పించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిల ప్ర శాంత్ మాట్లాడుతూ రైతు శంకరయ్య పేరున రెండు ఎకరాల భూమి ఉం డడంతో అతడికి ప్రభుత్వం రైతు బీమా బాండును అందజేసిందని, తాజా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృషితో త్వరలో మృతుడి కుటుంబానికి రూ. 5లక్షల రైతు బీమా అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, రైతుల సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గిన్నె కొండారెడ్డి, గుంత మల్లేశ్, శ్రీను, జీ చెన్నకేశవరెడ్డి, సత్యంయాదవ్, ఏ శ్రీను, వెంకటేశ్ పాల్గ్గొన్నారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...