అనారోగ్యంతో ఏఎస్సై మృతి


Wed,September 12, 2018 01:20 AM

తిమ్మాజిపేట : తిమ్మాజిపేట పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అబ్దుల్ నబీ (55) మంగళవారం ఉదయం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైన ఆయన దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీస్ సిబ్బంది మంగళవారం జడ్చర్లలో ఆయన నివాసానికి వెళ్లి ఏఎస్సై మృతదేహానికి నివాళులర్పించారు. మంగళవారం సాయంత్రం మహబూబ్‌నగర్ సమీపంలోని బోయపల్లిలో పోలీసు లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...