నీటి ట్యాంక్‌లో పడి బాలుడి మృతి


Wed,September 12, 2018 01:20 AM

గట్టు : ప్రమాదవశాత్తు నీటి ట్యాంకులో పడి ఓ బాలుడు మృ తి చెందిన ఘటన మండల కేం ద్రం గట్టులో మంగళవారం చో టు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆంజనేయులు భార్య కవిత, కుమారులు చిరు (4), పవన్(2)లతో కలిసి మంగళవారం పొలానికి వెళ్లాడు. అయి తే కుటుంబ సభ్యులందరూ సీడ్‌పత్తి పనుల్లో నిమగ్నమై ఉండగా పవన్ ఆడుకుంటూ కొంత దూ రంలో ఉన్న నీటి ట్యాంక్ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు జారీ అందు లో పడి మునిగిపోయాడు. కొం త సమయం తరువాత పవన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రు లు కవిత, ఆంజనేయులకు అనుమానం వచ్చింది. బాలుడి కోసం గాలించగా పవన్ నీటి ట్యాంక్‌లో మునిగి ఉండడాన్ని చూసి వెంట నే ఆ బాలుడిని ఒడ్డుకు తీసుకువచ్చి దవాఖానకు తరలించారు. ఆ బాలుడిని పరీక్షించిన వైద్యుడు అప్పటికే బాలుడు మృతిచెందినట్లు నిర్దారించారు. అప్పటి వ రకు సంతోషంతో ఆడుకుంటూ కనిపించిన చిన్నారి కొద్ది నిమిషా ల్లో మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనకు అంతుల్లేకుండా పోయింది. కవిత మొదటి కాన్పు లో నలుగురు శిశువులు జన్మించ గా ముగ్గురి చనిపోయి చిరు అనే చిన్నారి మాత్రమే మిగిలాడు. రెండవ కాన్పులో పవన్ జన్మించగా, ఆ చిన్నారిని మృత్యువు ఈ రూపంలో తీసుకుపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...