పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ


Tue,September 11, 2018 01:52 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వాహణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పాత ఈవీఎం మిషన్‌లను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పంపించడం జరుగుతుందని, ఈ నెల 15వ తేదీన నూతన వీవీపీఏటీ మిషన్‌లు జిల్లా కేంద్రానికి చేరడం జరుగుతుందని తెలిపారు. ఆధునాతన టెక్నాలజీతో కూడిన మిషన్‌లతోనే జరుగబోయే ఎన్నికల నిర్వహణ జరుగుతుందన్నారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని వివరించారు. నూతనంగా 121 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. సోమవారం ఓటరు జాబితను బహిర్గతం చేయడం జరిగిందన్నారు. ఈ నెల 25వ తేదీలోపు ఓటరు జాబితలో ఎలాంటి తప్పుఓప్పులు ఉన్న సరిచేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 8వ తేదీన ఫైనల్ జాబితను విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల నియమవాళికి సంబంధించి ఓటర్ల యొక్క తమ తమ అభ్యంతరాలను పరిగలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. గడువులోపు ఎలాంటి అభ్యంతరాలు ఉన్న అధికారులకు సమాచారం అందించి సరిచేసుకోవాలని సూచించారు. ఆయా పార్టీల నేతలు బీఎల్‌ఏలను వెంటనే ఏర్పాటు చేసుకుని పోలింగ్ కేంద్రం వారిగా సంబంధింత వీఆర్‌వోలకు సమాచారం అందించాలని చెప్పారు. నూతన విధానంతో ఎన్నికల నిర్వహణ ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండ జరిపిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, ట్రైనీ కలెక్టర్ మిలింద్‌బప్నా, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఆర్‌డీవో పీడీ వెంకట ఉపేందర్‌రెడ్డి, మెప్మా పీడీ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల వివరాలను సరిచూడండి
త్వరలో జరుగబోయే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రత్యేక చర్యలు ప్రణాళికలను అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలిసి మాట్లాడారు. ఓటర్ల వివరాలను తమ తమ పరిధిలో పూర్తిస్థాయిలో పరిశీలించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో పేర్లు తప్పుగా ఉన్నాయి.. ? ఈ వ్యక్తి పేరు ఇది కాదు ? అనే అనుమానాలను వ్యక్తం చే యడం సరికాదన్నారు. రాజకీయ పార్టీల నే తలు ఓటర్ల జాబితపై ప్రత్యేక దృష్టిసారించి ఎలాంటి అభ్యంతరుల ఉన్న తక్షణమే సంబంధింత అధికారులకు తెలియజేసి సరిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, ట్రైనీ కలెక్టర్ మిలింద్‌బప్నా, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఆర్‌డీవో పీడీ వెంకట ఉపేందర్‌రెడ్డి, మెప్మా పీడీ గోపాల్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు రంగరావు, రాములు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక చర్యలు చేపట్టండి
జరుగుతున్న ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ జిలా అధికారులు, ఎంపీడీవోలకు, తహసీల్దార్లు, వీఆర్‌వోలకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని సూచించారు. నూతనంగా నమోదు చేసుకునే వారు ఫాం 7లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండేలా చూడాలని సూచించారు. ఎలాంటి విమర్శలకు తావులేకుండ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.ఎలాంటి ఇబ్బందులు ఉన్నతక్షణమే సమచారం అందించాలని చెప్పారు.కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మిలింద్‌బప్నా,డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఆర్‌డీవో పీడీ వెంకట ఉపేందర్‌రెడ్డి, మెప్మా పీడీ గోపాల్ పాల్గొన్నారు.

ఎన్నికల నిబంధనలు పాటించండి
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : జరుగనున్న ఎన్నికలు ప్రశాంతమైన వాతావారణంలో జరిగేందుకుగాను ఎన్నికల కమిషన్ నిబంధనలు తూచ తప్పకుండ పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్‌కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. ఎన్నికల విధులలో పాల్గొనే అధికారుల ఖాళీలను గుర్తించి వెనువెంటనే సమర్పించాలని, ఓటరు జాబితా గడువులోగా పూర్తి చేయాలన్నారు. నూతన ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనులు నిర్వహించాలని, సమాచారం తెలియజేయడంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. జిల్లాలో పోలింగ్ స్టేషన్ల వివరాలు నమోదు చేసుకుని ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్‌లు ఉండాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాగం సిద్ధంగా ఉందని, రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అవసరమైన నివేదికలను సమర్పిస్తామన్నారు. సమస్యత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఎలాంటి శాంతి భద్రతలకు వివాదాలు తలెత్తకుండ చూస్తామన్నారు. ప్రత్యేక ప్రణాళికలతో ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగుతామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, ట్రైనీ కలెక్టర్ మిలింద్‌బప్నా, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఆర్‌డీవో పీడీ వెంకట ఉపేందర్‌రెడ్డి, మెప్మా పీడీ గోపాల్‌లు పాల్గొన్నారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...