టీఆర్‌ఎస్‌కు తిరుగులేని మెజార్టీ ఇవ్వండి


Tue,September 11, 2018 01:52 AM

-పాలమూరు అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్
-జిల్లా కేంద్రంలో విస్తృత ప్రచారం
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ప్రజా సం క్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ ఇవ్వాలని మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కోరారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్ర ణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నా రు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించుకుంటూ ముందుకు సాగామన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజలంద రూ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ము న్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

140
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...