కాంగ్రెసోళ్ల పాలనలో తండాలను దగా చేశారు..


Tue,September 11, 2018 01:51 AM

-టీఆర్‌ఎస్ పాలనలోనే తండాల అభివృద్ధి
-నారాయణపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి
కోయిలకొండ : 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో గిరిజనుల ఓటుబ్యాంక్‌గా వాడుకొని తండాల అభివృద్ధిని విస్మరించి దగా చేశారని నారాయణపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం కోయిల్‌కొండ మండలం శేరి వెంకటాపూర్ గ్రామంలో గిరిజన తండావాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 3,642 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గుర్తింపు తీసుకురావడం జరిగిందన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో తండాలకు రోడ్డు, తాగునీటి సౌకర్యంతోపాటు మౌళిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. తండాలను అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ నాయకుల మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవన్నారు. ముందుగా కొత్లాబాద్‌లోని మల్లన్న స్వామి దేవాలయంలో కురుమ యాదవులతో కలిసి ఎస్.రాజేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

టీఆర్‌ఎస్‌కే గిరిజనుల మద్ధతు..
సీమాంధ్ర పాలన లో తండాలను ఎవ రూ పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడిన తర్వాత తండాలను పంచాయతీలుగా మార్చి అన్ని సౌకర్యా లు కల్పించిన టీఆర్‌ఎస్‌కే తాము మద్ధతిస్తామని గిరిజనులు స్ప ష్టం చేశారు. శేరి వెంకటాపూర్‌లో జరిగిన స మావేశంలో పలువురు గిరిజనులు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం తండాలు పంచాయతీలుగా చేయడంతో తండా అభివృద్ధిపై గ్రామ సభలు నిర్వహించుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు. తండాలో వాటర్‌ట్యాంక్‌లను నిర్మించి తాగునీటిని అందిస్తున్నారన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి కృషితో ప్రతి తండాకు రోడ్డు వసతి కల్పించారని తెలిపారు. మండలంలోని గిరిజన తండావాసులు టీఆర్‌ఎస్‌కే పూర్తి మద్ధతు తెలుపుతూ రాజేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని తీర్మాణం చేశారు. సమావేశంలో మాజీ సర్పంచ్‌లు తులసీరాం, లక్ష్మమ్మ, వెంకటేశ్ నాయక్, లక్ష్మణ్‌నాయక్, వెంకట్ నాయక్ నాయకులు శంకర్‌నాయక్, వాస్యానాయక్, మోతీలాల్, పాండునాయక్, తావుర్యానాయక్, రమేశ్, వాసు, మోహన్ నాయక్, రమేశ్, గేమ్యానాయక్ పాల్గొన్నారు.

164
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...