క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడొద్దు


Tue,September 11, 2018 01:51 AM

మహబూబ్‌నగర్ క్రైం : ప్రతి సమస్యకు మా ర్గం ఉంటుందని, క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఎస్వీఎస్ మెడికల్ కళాశాల మానసిక వైద్యనిపుణులు ప్రొఫెసర్ అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాలమూరు ట్యాంక్‌బండ్‌పై ఆత్మహత్యల ని వారణ దినోత్సవం సందర్భంగా ఎస్వీఎస్ మె డికల్ కళాశాల వైద్య విద్యార్థులు మార్నింగ్‌వాక్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ చాలా మందికి అనేక సమస్యలు రావడంతో ఆ సమస్యే జీవితం అనుకొని, దానికి ఎలాంటి ప రిష్కారం మార్గాలు చూడకుండా క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని చె ప్పారు. సమస్యలు అందరికీ ఉంటాయి, అంత మాత్రాన చనిపోవడం పరిష్కారం కాదు. సమస్యలతో కుంగిపోయిన వారికి అండగా మానసిక వైద్యులుగా మేమున్నామని, మీ సమస్యలను పరిష్కరించే విధంగా చర్చిందామన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవలసిన అవసరం లేద ని సూచించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ మాట్లాడుతూ దవాఖానకు ఎక్కువగా 90 శా తం ఆత్మహత్యల కేసులు వస్తున్నాయని, స మాజంలో కమ్యూనిటీలో లేకపోవడం, బాధ లు పంచుకుంటే ప్రమాదాలను నివారించవచ్చన్నా రు. దేశంలో ప్రతి 2నిమిషాలకు ముగ్గు రు ఆత్మహత్యల బారిన పడుతున్నారని ఆయ న ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి ఒక్క 45 సె కన్ల్లు ఆలోచించగలిగితే ఈ ఆత్మహత్యలను ని వారించవచ్చు అని సూచించారు. ఎస్వీఎస్ మె డికల్ కళాశాల డైరెక్టర్ రాంరెడ్డి మాట్లాడుతూ క్షణికావేశంలో ఆత్మహత్యలు పెరుగుతున్నా యి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి వారికి కౌన్సెలింగ్ ఇస్తే ఆత్మహత్యలు తగ్గుతాయన్నా రు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు చంద్రశేఖర్, పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఎస్వీఎస్ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...