కారు..జోరు


Mon,September 10, 2018 02:00 AM

-వాడవాడలో విస్తృత ప్రచారం
-ప్రజల నుంచి అపూర్వ స్పందన
-అభివృద్ధికి మరో అవకాశం ఇవ్వండి
-పాలమూరు అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్
-ప్రజల మధ్యే ఉంటా..
-మక్తల్ అభ్యర్థి చిట్టెం
మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా ఎన్నికల ప్రచా రం నిర్వహిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం క్రిస్టియన్ కాలనీకి చే రుకొని టీఆర్‌ఎస్ సీనియర్ నేత బె క్కెం జనార్దన్ తదితరులతో క లిసి ఎన్నికల ప్రచారం చేశా రు. కాలనీలోని పలు చో ట్ల పర్యటించి ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపి స్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేసి తీరుతానని శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు. అ క్కడి నుంచి క్లాక్‌టవర్‌కు శ్రీనివాస్‌గౌడ్ చేరుకొని పూ ల వ్యాపారులు, వస్త్ర వ్యాపారులను స్వయంగా కలిశారు. ఎన్నికలలో తనకు అండగా నిలవాలని కోరారు. సార్ మీరు నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసిండ్రు. ఇంగ కొన్ని పనులే మిగిలినవి. మీరొస్తే ఆ పనులు పూర్తి కావడమే కాదు, సాగు.. తాగునీళ్లు వస్తాయని పలువురు వ్యాపారులు పేర్కొన్నారు. మీరు మా వస్ర్తాలయానికి రావడం సంతోషమని పలువురు వ్యా పారులు ఆనందంగా శ్రీనివాస్‌గౌడ్‌ను సన్మానించి త మ మద్ధతును ప్రకటించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన శ్రీనివాస్‌గౌడ్ ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. శ్రీనివాస్‌గౌడ్ క్యాంపు కార్యాలయానికి పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు చేరుకొని శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్ వచ్చిన సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. ఆర్టీసీ ఎంప్లాయీ స్ అసోసియేషన్, ఎక్సైజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు శ్రీనివాస్‌గౌడ్‌ను సన్మానించి అభినందనలు తె లిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, వైస్ చైర్మన్ రాములు, కౌన్సిలర్ కృష్ణమోహ న్, రవీందర్‌రెడ్డి, సుదీప్‌రెడ్డి తదితరులు శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు పట్టణంలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు.

152
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...