కవిత్వం ఎప్పుడూ ప్రజల పక్షమే..


Mon,September 10, 2018 01:58 AM

- రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్
జడ్చర్ల టౌన్ : కవిత్వమెప్పుడూ ప్రజల పక్షమే ఉంటుందని రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. ఆదివారం జడ్చర్లలోని లయన్స్‌క్లబ్ భవనంలో కాళోజి జయంతి, తెలుగుభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ సాహిత్య ప రిషత్ ఆధ్వర్యంలో కవిసమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా బాద్మి మాట్లాడుతూ కాళోజి జీవితం కవులందరికి ఆదర్శమన్నారు. కాళోజికి దివంగత ప్రధాని పీవీ.నర్సింహా రావుకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా ఎన్నికైన బాద్మిని శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కాళోజి జయంతి, తెలుగుభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని జడ్చర్ల జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన కవిసమ్మేళనంలో కవులు ఆలపించిన కవితలు ఆక ట్టుకున్నాయి. ప్రముఖ కవులు కుంచకూరి బుచ్చిలింగం, ఉమ్మెంతల మహేశ్వర్‌లు చదివి న పద్యాలు శ్రోతలను అలరించాయి. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ పురస్కార గ్రహిత ప్రముఖ నాటకరంగ కళాకారుడు దుప్పల్లి శ్రీరాములును ఘనంగా సన్మా నించారు. కార్యక్రమంలో సాహిత్య పరిషత్ గౌరవ అధ్యక్షుడు దత్తుకుమార్, అధ్యక్షుడు పూదత్తు కృష్ణమోహన్, గుంత శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి చక్రవర్తుల రమ ణాచా ర్యులు, పద్మలీల, కిరణ్మయి, పాలాది రామ్మోహన్, మాధవి శ్రీనివాస్, గోనెల రాధా కృష్ణ, సునిత, సరస్వతి, రవి, ఉదయమిత్ర, జయప్రకాష్, నిమ్మయ్య, బాలస్వామి ఉన్నారు.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...