అభివృద్ధికి టీఆర్‌ఎస్ పాలన


Mon,September 10, 2018 01:57 AM

నారాయణపేట, నమస్తేతెలంగాణ : నిదర్శంగా పాలన సాగిందని రాయణపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎంకే గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్.రాజేందర్‌రెడ్డి సమక్షంలో ముస్లిం యువకులు చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాలకులు ఓటు బ్యాంకుగా ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.4వేల కోట్ల నిధులను కేటాయిస్తే, ఒక్క తెలంగాణ ప్రభుత్వమే రూ.2వేల కోట్లను మంజూరీ చేసి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రంజాన్, క్రిస్మస్ సందర్భంగా ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని నిరుపేద మైనార్టీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం దుస్తులను పంపిణీ చేస్తుందన్నారు. ఇమామ్, మౌజమ్‌లకు దేశంలో ఎక్కడ లేని విధంగా నెలకు రూ.5వేల భృతి అందజేస్తుందన్నారు. నారాయణపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఊర్దూ మీడియంలో సీఈసీ గ్రూపు మంజూరీ చేయించడం జరిగిందని, అదేవిధంగా వేయించడం జరిగిందన్నారు. నాంపల్లిలో 4వేల 300ల చదరపు గజాల స్థలంలో రూ.20 కోట్ల వ్యంయతో ముస్లిం అనాథలకు అనీస్ ఉల్ గుర్భా కొత్త భవనాన్ని నిర్మిస్తుందన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్.రాజేందర్‌రెడ్డిని శాలువా, పూలమాతో మైనార్టీ యువకులు సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ నాగరాజు, కౌన్సిలర్ మారుతి, ఎఎంసీ డైరెక్టర్ జగన్నాథ్, నాయకులు డాక్టర్ పి.నర్సింహరెడ్డి, గందెచంద్రకాంత్, మూసానవాజ్, వెంకటేశ్వర్‌రెడ్డి, కోట్ల రాజవర్ధన్‌రెడ్డి, వేపూరి రాములు, ప్రతాప్‌రెడ్డి, కడ్లప్ప, గురులింగం, గంజాయి సతీష్, శేఖర్‌రెడ్డి, విజయ్‌సాగర్, చందు యాదవ్, నర్సింహ, మహిమూద్, అజహార్, ఫిరోజ్, గందె సుమిత్, స్టిల్ రాజులు పాల్గొన్నారు.

156
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...