కళారంగానికి పూర్వవైభవం


Mon,September 10, 2018 01:57 AM

-టీఆర్‌ఎస్ ప్రభుత్వంహయాంలో కళాకారులకు ప్రత్యేక గుర్తింపు
-కళాకారుల సంఘంఆధ్వర్యంలో ప్రత్యేకకార్యక్రమం
-హాజరైనఎంపీ జితేందర్‌రెడ్డి, బాద్మి,మాజీ ఎమ్మెల్యే శ్రీనన్న
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : కళాకారులకు పూర్వవైభవం తీసుకువచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలోనే జరిగిందని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నా రు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ము న్సిపల్ టౌన్‌హాల్‌లో జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు వి. మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత నాటక కళారంగ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బాద్మిశివకుమార్, డాక్టరేట్ లభించడం పట్ల మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ను , మార్కెట్ కమిటీ చై ర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కాడం ఆం జనేయులను శాలువా, పూలమాలల తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ రం గస్థలం, యక్షగానం, వాయిద్య, పద్యనాటక కళాకారులకు పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. ఢిల్లీస్థాయి లో జిల్లా కళాకారులకు ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. టౌన్‌హాల్‌కు సంబంధించి వివిధ సదుపాయాల క ల్పన నిమిత్తం ఆర్థిక సహయం అందిస్తానన్నారు. కళాకారులకు ఎలాంటి ఇ బ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...