మత్స్యకారుల అభివృద్ధే ..టీఆర్‌ఎస్ లక్ష్యం


Mon,September 10, 2018 01:56 AM

-సమన్వయ సమితి జిల్లా సుచరితారెడ్డి
-నర్సిరెడ్డి రిజర్వాయర్‌లో 8 చేప
మక్తల్, నమస్తే తెలంగాణ : మత్స్యకారుల అభివృద్ధే టీఆర్‌ఎస్ లక్ష్యమని రైతు సమన్వయ సమితి సభ్యురాలు చిట్టెం సుచరితారెడ్డి అన్నారు. ఆదివారం మత్స్య శాఖ అభివృద్ది సమీకృత పథకం ద్వారా మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపపిల్లలను చిట్టెం సుచరితారెడ్డి భీమా ఫేజ్ 1 అంతర్భాగమైన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ఆదివారం 8 లక్షల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా చిట్టెం సుచరితారెడ్డి మాట్లాడుతూ ముదిరాజ్‌లు ఆర్థికంగా ఎదగాలన్నదే టిఆర్‌ఎస్ ధ్యేయమన్నారు.కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ లక్ష్మప్ప, మత్స్యశాఖ సహకార సంఘం జిల్లా సత్యనారాయణ, జిల్లా మత్స్యశాఖ కార్యదర్శి కోళ్ల వెంకటేశ్, మత్స్యశాఖ సిబ్బంది యాదగిరి, సింగోటం, ఎంపీటీసీ రవిశంకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు దేవరింటి నర్సింహరెడ్డి, కావలి శ్రీహరి, గోవర్ధ్దన్‌రెడ్డి, మత్స్యశాఖ డైరెక్టర్ వాకిటి ఆంజయ్య, తిరుపతి, నర్సింహులు, టింగిలి గోపాల్, నాయకులు రామలింగం, నాగిరెడ్డి, శివకుమార్, ఆంజనేయులు, మత్స్యకారులు, తదితరులు పాల్గొన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...