అభివృద్ధికి పట్టం కట్టండి


Sun,September 9, 2018 01:54 AM

మక్తల్, నమస్తే తెలంగాణ/ఊట్కూర్ : రాష్ట్రంలో సీ ఎం కేసిఆర్ చేపట్టిన అభివృద్ధిని చూసి నియోజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్‌ను మరోసారి ఆదరించాలని మక్తల్ నియోజకవర్గ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మక్తల్ మండలంలోని సమాన్‌పల్లి ఆంజనేయస్వామి దే వాలయంలో ఎమ్మె ల్యే చిట్టెం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల ప్ర చారంలో భాగంగా గ్రామంలో పర్యటించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ టిఆర్‌ఎస్ అ భ్యర్థిగా ఉన్న తనను మరోసారి ఆదరించి అత్యధిక మె జార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చే యాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి రా వడం జరిగిందన్నారు. ప్రజల స్వప్నమైన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను సీఎం కేసీఆర్ సహకారంతో పూర్తి చేసి గత రెండు సంవత్సరాలుగా ని యోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు, రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్ర జా సంక్షేమమే ధ్యే యంగా ముందుకు సాగుతామని పే ర్కొన్నారు. నియోజకవర్గాన్ని రా ష్ట్రంలో ఆదర్శవంతంగా మార్చేందు కు కృషి చే స్తానని తె లిపారు.

అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ సరిహద్దు గ్రామం ఇడ్లూరు శంకలింగేశ్వర స్వామిని ద ర్శించుకుని ఆలయ పూజారులచే ఆయన ఆశీర్వాదం పొందారు. అనంతరం ఊట్కూర్ మండలంలోని స మస్తాపూర్ గ్రామం నుంచి సతీమణి చిట్టెం సుచరితారెడ్డితో కలిసి ఎన్నికల నగారాను మోగించారు. చిట్టెం కు గ్రామస్తులు ఘన స్వా గతం పలికారు. గ్రామస్తులనుద్దేశించి ఆయన మాట్లాడారు.స్వాతంత్రం ఏర్పడి 70 ఏళ్లు గడిచినా గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యం లేకపోగా సీఎం కేసీఆర్ అండదండలతో సంస్థాపూర్ గ్రామానికి రూ.1.90 కోట్ల నిధులను మంజూరు చే యించానని తెలిపారు. సంగంబండ రిజర్వాయర్ ద్వా రా ఊట్కూర్ మండలంలోని అన్ని గ్రామాల చెరువులను సాగు నీటితో నింపేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని, త్వరలోనే పనులను పూర్తి చేస్తామని తెలిపారు. రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యురాలు చిట్టెం సుచరితారెడ్డి, జెడ్పీటీసీ సూర్యప్రకాష్‌రెడ్డి, మా జీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. అంతకు ముందు శంకరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు.

కార్యక్రమంలో మంతన్‌గౌడ్ మా జీ సర్పంచ్ వనజా ఆంజనేయులుగౌడ్, నాయకులు కృష్ణయ్యగౌడ్, రామలింగం, ఎల్లారెడ్డి, రిటైర్డ్ ఏఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి, ఈశ్వర్‌యాదవ్, నేతాజీరెడ్డి, రాజమహేందర్, ఊట్కూర్ వైస్ ఎంపీపీ విజయసింహారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, మహిపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట్రామారెడ్డి, మాజీ సర్పంచ్ బాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, గంగాధర్ ఆచారి, ఎల్ల ప్ప, గోపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.అభివృద్ధి చేసి చూపిస్తాంకోస్గి : కొడంగల్ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అ భివృద్ధి చేసి చూపుతానని, తనను ఆశీర్వదించాలని కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. కోస్గి మండలం పోలెపల్లి గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి హకీంపేటకు చేరుకున్న నరేందర్‌రెడ్డికి కోస్గి, కొడంగల్, మద్దూర్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలకు చెందిన నాయకులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ ని ర్మాణం సాధ్యమవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడంతోపాటు, గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. కొడంగల్ ఎమ్మెల్యేగా రెండుమార్లు గెలుపొందిన రేవంత్‌రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రేవంత్ బురిడీ మాటలను నియోజకవర్గ ప్రజలు నమ్మవద్దని కోరారు. మాటలు ఎక్కువ..పని తక్కువ అన్న చం దంగా రేవంత్ వ్యవహరిస్తూ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేశాడన్నారు. కోస్గి బస్ డిపో నిర్మాణంపై ఇక్కడి ప్రజలను తన గారడీ మాటలతో మోసం చేశాడని ధ్వజమెత్తారు. టీవీలు, పత్రికల్లో ప్రగల్భా లు పలుకుతున్న రేవంత్ గారడీ మోసం ఇ క చెల్లదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. కోస్గిలో బస్ డిపో ఏర్పాటు కోసం నిధులు కేటాయిం చి పనులను ప్రారంభించామని చెప్పారు. కోస్గి బస్టాండ్‌ను ఆధునీకరించేందుకు మరో రూ. కోటి నిధులను కేటాయించడం జరిగిందన్నారు. కోస్గి, కొడంగల్ రెం డు పట్టణాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడంతోపాటు, రూ.30కోట్లను మంజూరు చేయించామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు ఆలోచనతో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి గుర్నాథ్‌రెడ్డి అనుమతితో తనకు కొడంగల్ అభ్యర్థిగా అ వకాశం కల్పించారని, ఎల్లమ్మతల్లి దీవెనలతో 50వే ల మెజార్టీతో తన గెలు పు ఖాయమన్నారు. కార్యక్రమంలో మాజీ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి శ్యా సం రామకృష్ణ, ఎంపీ పీ ప్రతాప్‌రెడ్డి, వైస్ ఎం పీపీ దోమ రాజేశ్వర్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షు డు అన్నకిష్టప్ప, జెడ్పీటీసీ రా స్నం అనితా బాల్‌రాజ్, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ హన్మంత్‌రెడ్డి, నాయకులు డీకే.నాగేశ్, ఓంప్రకాశ్, రాజేశ్, మ ధుకర్‌రావు, వెంకట్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, మధుసూదన్ యాదవ్, నరేందర్‌రెడ్డి, బోగారం వెంకట్రాంరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, సలీం, మల్‌రెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...