రాజీతోనే కేసుల పరిష్కారం


Sun,September 9, 2018 01:52 AM

-జిల్లా ఇన్‌చార్జి న్యాయమూర్తి కె.అజితసింహారావు
-లోక్ అదాలత్‌తో 481 కేసుల పరిష్కారం
మహబూబ్‌నగర్‌లీగల్: కక్షిదారులు వారి, వారి కేసుల్లో రాజీమార్గాన్ని అనుసరించినప్పుడే కేసులు పరిష్కారమవుతాయని జిల్లా కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి అజిత్‌సింహారావు అన్నారు. జిల్లా న్యాయసేవా సదన్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీ య లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయ న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవలి కాలంలో కుటుంబ సంబంధిత కేసులు పెరిగిపోతున్నాయని, వాటిని కూ డా ఇరు పక్షాల వారు సమష్టిగా రాజీ కుదుర్చుకునేందుకు లోక్‌అదాలత్ వీలు కల్పిస్తుందని చెప్పారు. కుటుంబ కేసులు ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉండటం వల్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరదన్నారు. రాజీకి వీలుండే కేసుల్లో మా త్రం కచ్చితంగా ముందుకు వచ్చి రాజీ కుదుర్చుకోవాలని చెప్పారు. లోక్ అదాలత్‌లో ఒక్క కుటుంబ పరమైన కేసులే కాకుండా సివిల్, క్రిమినల్(రాజీ కుదర్చుకోదగిన), మోటరు వాహన ప్రమాదాల భీమా కేసులు అన్నీ కూడా పరిష్కరించుకోవచ్చన్నారు.

సత్వర పరిష్కారం లక్ష్యంతో జాతీయ న్యాయసేవాసదన్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా సదన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లా న్యాయసేవాసదన్ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీవిద్య మాట్లాడుతూ సంవత్సరాల తరబడి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరు పక్షాలు సామరస్యంతో అంగీకరించుకుని లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో మొత్తం 481 కేసులను పరిష్కరించగలిగారు. వీటిలో సివిల్ 46, క్రిమినల్ 344, ప్రీలిటిగేషన్ కేసులు 91 కేసులకు పరిష్కారం లభించింది. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ వారు కక్షిదారులకు పులిహోర ప్యాకెట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో కుటుం బ కోర్టు న్యా యమూర్తి వసంత్, స్పెషల్ మొబైల్ కో ర్టు న్యాయమూర్తి తేజోకార్తీక్, మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి దీప్తి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ లయన్‌నటరాజ్, సీనియర్ న్యా యవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...