ఎమ్మెల్సీ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ యువ నాయకులు


Sun,September 9, 2018 01:52 AM

కోస్గిటౌన్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. శని వారం కోస్గి మండలంలోని పోలేపల్లి గ్రా మానికి వచ్చిన ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మొదట ఎల్లమ్మతల్లిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమా వేశంలో కొడంగల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన 50 మంది యువ కులు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో రాజు, నర్సింహులు, అప్పి, రమే శ్, నవీన్, బాల్‌రాజ్, కేశవులు రాజు, ఆహ్మద్, రవి కె రాజు, రమేశ్, శేఖర్, శం కర్, చిన్నరాజు తదితరులు న్నారు.హోరాహోరీగా లీగ్ మ్యాచ్‌లుమహబూబ్‌నగర్ స్పోర్ట్స్: జిల్లా కేంద్రంలో బోయపల్లి సమీపంలోగల ఎండీసీఏ మైదానంలో జరుగుతున్న ఉమ్మడి లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు హోరాహోరీగా కొనసాగుతున్నాయి.

శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మన్సూర్ అలీఖాన్ పటౌడీ జట్టుపై రోహిత్ శర్మ జట్టు 8 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ జట్టు 40 ఓవర్లలో 184 పరుగులకు అలౌట్ అయ్యింది. జట్టులో రాఠీ 44, రుతిక్ 26, అరుణ్ 20, శ్రీకాంత్ 12, సాయిపవన్ 10 పరుగులు చేశాడు. పటౌడీ జట్టులో సాయికుమార్ 4, ఖదీర్2, రాంబాబు, కేశవులు ఒక్కో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మన్సూర్ అలీఖాన్ పటౌడీ జట్టు 33.3 ఓవర్లలో 176 పరుగులకు అలౌట్ కాగా, జట్టులో ఖదీర్ 37,సాయికుమార్ 30, కిశోర్ 26, రమేశ్ 24, కేశవులు 16 పరుగులు చేశారు. రోహిత్ శర్మ జట్టు బౌలర్లలో అరుణ్ 5, శ్రీకాంత్ 3, రుతిక్ 2 వికెట్లు జట్టు విజయానికి కృషి చేశారు. 20 పరుగులు, 5 వికెట్లు తీసి రాణించిన అరుణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు.

జిల్లా క్రీడాకారులు రంజీకి ఆడాలి
జిల్లా క్రీడాకారులు రంజీకి ఆడాలని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. శనివారం జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఎండీసీఏ మైదానంలో జరుగుతున్న రోహిత్‌శర్మ , మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ జట్ల మధ్య మ్యాచ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులకు చక్కటి అవకాశం ఉందని, ప్రతిభ చాటాలని , ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికవుతారని తెలిపారు. రాష్ట్ర స్థాయి టోర్నీలో ప్రతిభ కనబరిస్తే రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉందని తెలిపారు. లీగ్ టోర్నీలో ప్రతిభ చాటాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ సంఘం ప్రతినిధులు సురేశ్‌కుమార్, గోపాలకృష్ణ, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

ఉత్సహంగా టీసీఏ క్రికెట్ లీగ్ పోటీలు
టీసీఏ అంతర్ జిల్లాల క్రికెట్ రెండు రోజుల అండర్-19 లీగ్ టోర్నీ ప్రారంభమైంది శనివారం బాలుర కళాశాల మైదానంలో మహబూబ్‌నగర్, షాద్‌నగర్ జట్ల మధ్య మ్యాచ్‌ను డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రతిభ గల క్రీడాకారులకు కొదవలేదని, జాతీయస్థాయిలో రాణించారని గుర్తుచేశారు, క్రికెట్‌లో రాణించాలని ఆకాంక్షించారు. మొదటి రోజు మ్యాచ్ మహబూబ్‌నగర్ జట్టు 72.2 ఓవర్లలో 268 పరుగులకు అలౌట్ అయ్యింది. జట్టులో సాయికుమార్ 83, ఫేరోజ్ 61, రవి 27 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన షాద్‌నగర్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఆదివారం రెండో మ్యాచ్ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ కోచ్ ప్రేమ్‌కుమార్, మేనేజర్ గోపినాథ్, షాద్‌నగర్ కోచ్ మేనేజర్ జ్ఞానేశ్వర్, సీనియర్ క్రీడాకారులు నవీన్, నరేశ్, నదీం, నాయకులు ఖలీల్, ఖాజాపాష తదితరులు పాల్గొన్నారు.

162
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...