కాంగ్రెస్ గజదొంగల పార్టీ


Sun,September 9, 2018 01:51 AM

మద్దూరు: కాంగ్రెస్ పార్టీ గజదొంగల పార్టీ అని ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నియోజక వర్గ ఇన్‌చార్జీ గురునాథ్‌రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజక వర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డిలు శనివారం మండలంలో పర్యటించారు. మద్దూరు పాత బస్టాండ్‌లోని ఆంజనేయ స్వామి దేవాలయం, నిడ్జింత గ్రామ శివారులోని తిరుమల దేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ సమీపంలో రాత్రి ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీ పీసీసీ అధ్యక్షుడు చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మాటల మాంత్రికుడని, ప్రజలకు ఏ ఒక్క పని చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్‌లో అందరు ముఖ్యమంత్రి అభ్యర్థులేనని ఎద్దేవా చేశారు. నియోజక వర్గ ప్రజలను రేవంత్‌రెడ్డి మోసం చేసి గెలిచారని తెలిపారు. నియోజక వర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు టీఆర్‌ఎస్‌ని గెలిపిస్తాయని తెలిపారు. నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాల్‌సింగ్ నాయక్, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు సలీం, జడ్పీవైస్ చైర్మన్ కృష్ణ, నాయకులు వంచర్ల గోపాల్, ఉసేనప్ప, వీరేశ్‌గౌడ్, శివకుమార్, శ్రీనివాస్‌రెడ్డి, ఆశప్ప, జిలాని, వీరారెడ్డి , జగదీశ్ పాల్గొన్నారు.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...