పాముకాటుతో విద్యార్థి మృతి


Sun,September 9, 2018 01:51 AM

ఊట్కూర్ : పాముకాటుతో విద్యార్థి మృతిచెందిన సంఘటన మండలంలోని ఓబ్లాపురం గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుమ్మరి శేషమ్మ, మల్లేశ్ దంపతులకు ఇద్దరు సంతానం. శుక్రవారం రాత్రి ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసి నిద్రపోయారు. ఆర్ధరాత్రి తల్లి దండ్రులతో పాటు ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు మనోజ్ (8)ను పాము కాటు వేసింది. కుమారుడి చెవికి పాము కాటు గుర్తించిన తల్లిదండ్రులు స్థానికంగా నాటు వైద్యం చేయించారు. ఆ త ర్వాత నారాయణపేట ఏరియా దవాఖానలో చేర్పించ గా, చికిత్స పొందుతూ మృత్యువాత పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదవుతున్న విద్యార్థి మనోజ్‌కుమార్ చదవులో మంచి ప్రతిభ కలిగి ఉండేవాడని పాఠశాల ప్రధానోపాద్యాయుడు గురునాథ్ విద్యార్థి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని జెడ్పీటీసీ సూర్యప్రకాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు లకా్ష్మరెడ్డి, మాజీ సర్పంచ్ భీంరెడ్డి పరామర్శించారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...