ప్రచార హోరు..!


Sat,September 8, 2018 02:40 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార జోరును అందుకుంది. ఇప్పటికే జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాలను ఆరంభించారు. ప్రతిపక్ష పార్టీలు పొత్తులు కుదుర్చుకునే విషయంలోనూ, అభ్యర్థులను ఎంపిక చేసుకునే అంశాల్లోనూ సతమతమవుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులతోపాటు పార్టీ శ్రేణులు సీఏం కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తి, అభ్యర్థులను ప్రకటించిన విధానాలతో హర్షం వ్యక్తం చేస్తూ గెలుపే లక్ష్యంగా తమ ప్రచార కార్యక్రమాలను ఆరంభించారు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌లోని ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను పరిష్కరించడంతోపాటు ఆయా పార్టీలలో అసంతృప్తితో ఉన్న ముఖ్య నాయకుల ను పిలిపించి చర్చలు జరిపారు. జిల్లాలోని అభ్యర్థుల గెలుపు కోసం అందరు సమిష్టిగా కృషి చే యాలని ఆయన కోరారు. మహబూబ్‌నగర్ ని యోజకవర్గ అభ్యర్థిగా ఎంపికైన శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు పొందిన అనంతరం తన ఇష్ట దైవాలకు పూజలు నిర్వహించారు. వేలాదిగా తరలి వచ్చిన ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని ఆయన అమరవీరులకు నివాళులర్పించా రు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని పలు వీధుల్లో పర్యటించి తనకు ఓటేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు.

దేవరకద్ర నియోజకవర్గంలోని ఉట్కూర్ మండల పరిధిలోని అ న్నాసాగర్ గ్రామంలో తాజా మాజీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి మండలంలోని గ్రామాలలో ఎన్నికల ప్రచార కమిటీలను ఏర్పాటుచేసుకొని ప్రచారాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, నీటి వనరులు, తదితర అంశాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని వెంకటేశ్వర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు.అంతకుముందు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చిన పార్టీ నాయకులు, కా ర్యకర్తలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని ఘనంగా సన్మానించి ఎన్నికలకు మరింత ఉత్సాహంగా ముందు కు సాగుతామని హామీ ఇచ్చారు. నారాయణపేట నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపికైన రాజేందర్‌రెడ్డి యానగొంది మాతా మాణికేశ్వరి ఆశీర్వాదాలు తీసుకొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టా రు. ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. మక్తల్ అభ్యర్థిగా ఎంపికైన చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం కృష్ణ మండల కేంద్రంలోని శివాలయంలో పూ జలు నిర్వహించి ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఆయన కార్యకర్తలకు వివరించారు. శనివారం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం మరింత జోరందుకోనుంది.

బేజారులో ప్రతిపక్ష పార్టీలు
జిల్లాలోని 5 అసెంబ్లీ స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించగా వారు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించి ప్రజల మన్ననలను అందుకోవడానికి దూసుకెళ్తుండగా ప్రతిపక్ష పార్టీలు మా త్రం బేజారవుతున్నాయి. ఆయా నియోజకవర్గాల నుంచి వారి అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంలో నేతల అభిప్రాయాలు కుదరక పోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తే ఇతర అభ్యర్థులు సహకరించని పరిస్థితులు ఉండడంతో నేతలు ఎవరి ఆధిపత్యాన్ని వారు చెలాయించుకోవడానికి చూ స్తుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక శుక్రవారం నాటికి కొలిక్కి రాలేక పోయింది. ఆయా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, రకరకాల ప్రచారాలు జరిగినప్పటికీ సాయంత్రానికి అది ఉత్తుతిదే అని తేలడంతో ఆయా పార్టీల అభిమానులు మరింత నిరాశ చెందారు. కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి తదితర పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ క్ర మంలో ఏ స్థానం ఏ పార్టీకి దక్కుతుందో అంచనా వేయడం కష్టమని పలువురు నేతలు పేర్కొంటున్నారు. అన్ని పార్టీలు ఏకమైనా కారు వేగాన్ని

139
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...