అభివృద్ధిని చూసి పట్టం కట్టండి


Sat,September 8, 2018 02:40 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : నాలుగేళ్లలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటూ చేసిన అభివృద్ధిని చూసి మరో సారి ఆశీర్వాదించాలని తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం పాలమూరు జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశీర్వాదం పొంది, తన ఇష్టదైవానికి మొక్కి వేలాది మంది టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో బైక్ ర్యాలీని నిర్వహించి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో గురువారం హైదరాబాద్ బయలుదేరి వెళ్లిన శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకోగానే వేలాది మంది టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ నేరుగా తన ఇంటికి చేరుకొని తల్లిదండ్రులు శాంతమ్మ, నారాయణగౌడ్‌ల ఆశీర్వాదం తీసుకున్నా రు. అనంతరం తన ఇష్ట దైవాలకు పూజలు చేశారు. భారీ ఎత్తున తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుండడంతో పెద్ద ఎత్తున హర్షద్వానాలు చేశారు. పాలమూరు పట్టణంతోపాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుం చి తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున మోటరు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. వారితోపాటు శ్రీనివాస్‌గౌడ్ మోటరు సైకిల్‌ను నడుపుతూ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చారు. ర్యాలీ శ్రీనివాస కాలనీ నుంచి మెట్టుగడ్డ, న్యూటౌన్, అశోక్ టాకీస్ చౌరస్తా, క్లాక్‌టవర్, తెలంగాణ చౌరస్తా, సత్యమన్న స్టాచ్యు, తదితర దారుల గుండా ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్దకు చేరింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ అమరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సత్యమన్న చౌరస్తా సమీపంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవానికి టీఆర్‌ఎస్ శ్రేణులతోపాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సై తం తరలి వచ్చారు. క్రిష్టియన్ కా లనీ సమీపంలోనూ, బాలుర కళాశాల సమీపంలోనూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యాలయానికి సమీపంలో ఉన్న కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆటోలు, ట్రాక్టర్లపై వెళ్తున్న వారి వద్దకు శ్రీనివాస్‌గౌడ్ వెళ్లి ఎన్నికల్లో తమకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భం గా ఆయన ఈ నాలుగేళ్లలో మీరు ఆశించిన స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాను. మరో మారు అవకాశం ఇస్తే పాలమూరును సస్యశ్యామలం చేసి తీరుతానని, వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, వైస్ చైర్మన్ రాములు, సింగిల్‌విండో చైర్మన్ కోరమోని వెంకటయ్య, టీఆర్‌ఎస్ నేతలు బెక్కెం జనార్దన్, రాజేశ్వర్, గుద్దెటి శివకుమార్, శివరాజు, ప్రతాప్‌రెడ్డి, పిల్లి సురేష్, పాపారాయుడు, సుధ, ఆర్టీవో మెంబర్ జావిద్‌బేగ్, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్‌రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ నవీన్‌రాజ్, నాని, కోఆప్షన్ మెంబర్ ప్రభాకర్, కౌన్సిలర్లు కృష్ణమోహన్, రాషద్‌ఖాన్, జ్యోతి పాల్గొన్నారు.

182
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...