కేసీఆర్ కిట్ భేష్


Sat,September 8, 2018 02:39 AM

మహబూబ్‌నగర్ వైద్యవిభాగం : రాష్ట్రం లో అమలవుతున్న కే సీఆర్ కిట్ పథకం అ ద్భుతమని కేంద్ర ప్ర భుత్వ ఢిల్లీ అండర్ సె క్రటరీ అధికారులు హే మం భారతీయా, నం దలాల్‌లు అన్నారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అం దిస్తున్న వైద్యసేవలు, ఆరోగ్య పథకాలపై శుక్రవారం సర్వే నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. వైద్యసేవలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ స్థానంలో నిలిచిందన్నారు. కేసీఆర్ కిట్ అందజేతతో పేదలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. అనంతరం కేసీఆర్ కిట్ పంపిణీ, అమ్మఒడి, కంటి వెలుగు, 104,108, దక్షతా కార్యక్రమం, ఎన్‌ఆర్‌సీ, ఎస్‌ఎన్‌సీయూ, మాతా శిశు సంరక్షణ కోసం తీసుకుంటున్న సేవలు, ప్రభుత్వ దవాఖానలలో అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. కేసిఆర్ కిట్‌లో ఉన్న వస్తువులను పరిశీలించి పథకం సేవలపై తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. అనంతరం బాల్యవివాహాలపై ఆరా తీశారు. బాల్యవివాహాల నివారణకు ప్ర త్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి కృష్ణ, డెమో అధికారి వేణుగోపాల్‌రెడ్డి, రవిశంకర్, దత్తాత్రీరావు తదితరులు పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...