పాలమూరులో కృష్ణమ్మ పరవళ్లు పెట్టిస్తాం


Sat,September 8, 2018 02:39 AM

-నాలుగున్నరేళ్లలో ఊహించని అభివృద్ధి చేశా..
-మళ్లీ గెలిపించి ఆశీర్వదిస్తే కరవు తీరేలా అభివృద్ధి చేస్తా
-టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : బీడువారిన పాలమూరులో కృష్ణ మ్మ పరవళ్లు తొక్కే వరకు విశ్రమించనని, నియోజకవర్గంతోపాటు జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేందుకు తన వంతు కృషి చేస్తానని మహబూబ్‌నగర్ టీ ఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం జి ల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. తన తండ్రి 1969 తెలంగాణ ఉద్యమ సమయం లో పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారని, ఆ సమయంలో పుట్టిన తాను తెలంగాణ కో సం ఆలోచిస్తూ ఉండేవాడినని చెప్పారు. అనుకోకుండా మలి ఉద్యమంలో పోరాటం చేసే అవకాశం తనకు లభించిందన్నారు. టీఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తాను ప్రతిక్షణం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని, ఎవరూ ఊహించని రీతిలో పాలమూరును ప్రగతి పట్టాలపై పరుగులు తీయించానని వివరించారు. తరతరాలుగా సాధ్యం కాని అభివృద్ధి పనులన్నీ ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పూర్తి చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ తదితరుల సహకారాలతో నియోజకవర్గానికి అవసరమైన వసుతులన్నింటిని సమకూర్చామన్నారు. బై పాస్ రోడ్డు, మయూరి నర్సరీ, మినీ ట్యాంక్ బండ్, కలెక్టరేట్, గురుకుల పాఠశాలలతోపాటు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేశామని శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. అన్ని కులాలు, మతాలకు ప్రాధాన్యతను ఇస్తూ వారికి అవసరమైన ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు స్థలాలు, నిధులు కేటాయించామన్నారు. ఇంతగా అభివృద్ధి జరుగుతుంటే కొంతమంది ఓర్వలేక కోర్టుల్లో కేసులు వేశారని, అనవసరమైన ఆరోపణలు చేశారన్నారు. ప్రజలందరూ అండగా ఉండి మళ్లీ గెలిపించాలని, ఇప్పటికీ మించి పాలమూరును అభివృద్ధి చేస్తానని చెప్పారు.

ముగ్గురికి ఎల్‌వోసీల అందజేత
ఆనారోగ్యం పాలై ఇబ్బందులకు గురయ్యే వారికి అండగా నిలిచి ఎల్‌వోసీలు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తూ వచ్చిన శ్రీనివాస్‌గౌడ్ గురువారం శాసనసభ రద్దు కావడానికి అరగంట ముందు కూడా ముగ్గురికి ఎల్‌వోసీలను మంజూరు చేయించారు. ఇబ్రహీంబాద్ మాజీ సర్పంచ్ రామయ్య గుండెనొప్పితో బాధపడుతూ వైద్య సేవలకు డబ్బులు లేకపోవడంతో డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్‌ను సంప్రదించారు. ఆయన పరిస్థితులను గమనించి రూ.లక్షా 50వేల ఎల్‌వోసీని తెప్పించి అందజేశారు. మరో ఇద్దరికి కూడా శ్రీనివాస్‌గౌడ్ ఎల్‌వోసీలను అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, వైస్ చైర్మన్ రాములు, సింగిల్‌విండో చైర్మన్ కోరమోని వెంకటయ్య, కౌన్సిలర్లు కృష్ణమోహన్, జ్యోతి, శివశంకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, నాయకులు శివరాజు, ఆనంద్‌కుమార్‌గౌడ్, గోపాల్‌యాదవ్, అక్తర్‌బేగ్, పిల్లి సురేష్ ఉన్నారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...