సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ల ఖరారుపై హర్షాతిరేకాలు


Fri,September 7, 2018 01:48 AM

మహబూబాబాద్ టౌన్, సెప్టెంబర్ 06: తాజా మాజీ ఎమ్మెల్యేలైన బానోత్ శంకర్‌నాయక్, కోరం కనకయ్యకు సీట్ల ఖరారుపై మహబూబాబాద్ నియోజకవర్గంలోని మానుకోట, కేసముద్రం, గూడూరు, ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం, గార్లలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు గురువారం సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పటాకులు పేల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఇందులో భాగంగా జిల్లాకేంద్రంలోని కేటీఆర్‌కాలనీ, జగ్జీవన్‌రాం కాలనీవాసులు కేసీఆర్, బానోత్ శంకర్‌నాయక్ చిత్రపటాలకు ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా కార్యదర్శి కొండ్ర ఎల్లయ్య, నాయకులు ముప్పు గుట్టయ్య, వెంకటాచారి, పులి శ్రీను, సాంబ శివరావు, చాగంటి రవి, నేలమర్రి మోహన్, పద్మారెడ్డి, సందీప్, బాలకృష్ణ, గోనె భాగ్యమ్మ పాల్గొన్నారు.

మహబూబాబాద్ రూరల్: శంకర్‌నాయక్‌కు టికెట్ కేటాయింపుపై హర్షం వ్యక్తం చేస్తూ ఈదులపూసపల్లిలో టీఆర్‌ఎస్ శ్రేణులు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని మురళి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మరోసారి శంకర్‌నాయక్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వెన్నం భరద్వాజరెడ్డి, సుదగాని నరేశ్, రావుల గోవర్ధన్‌రెడ్డి, గీసగాని శ్రీనివాస్, రావుల వెంకట్‌రెడ్డి, పంక్త్యా, బుచ్చిరెడ్డి, బాలునాయక్, రవి, సీతారాంనాయక్, సీహెచ్ రామన్న పాల్గొన్నారు.

కేసముద్రంటౌన్: మండలకేంద్రంలో టీఆర్‌ఎస్ నాయకులు పటాకులు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. డీజేతో ర్యాలీ నిర్వహించి, అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆత్మ చైర్మన్ పోలెపల్లి నెహ్రూరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ ఓలం చంద్రమోహన్, రావుల శ్రీనాథ్‌రెడ్డి, నజీర్ అహ్మద్, శ్రీరామోజ్ మహేశ్వరాచారి, అల్లి బీరయ్య, తొనుపునూరి సాయి, చిట్యాల వీరన్న, ఊరుగొండ శ్రీరాములు, ముత్యాల శివకుమార్, తోకల నాగిరెడ్డి, పరంకుశం శ్రీహరి, నర్సింహరెడ్డి, తమ్మడబోయిన రాజు పాల్గొన్నారు.

గూడూరు: శంకర్‌నాయక్‌కు టికెట్ రావడంపై హర్షిస్తూ టీఆర్‌ఎస్ మండల నాయకులు స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వేం వెంకటకృష్ణారెడ్డి, నాయకులు దామర నర్సయ్య, సంపత్‌రావు, ఆకుల రమేష్, కఠార్‌సింగ్, నర్సింహనాయక్, పూల్‌సింగ్, జిల్లా యాకయ్య, ఎడ్ల రమేశ్, మారెల్లి శోభన్‌బాబు పాల్గొన్నారు.

బయ్యారం: ఇల్లందు తాజా మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు టిక్కట్ రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ బస్టాండ్ సెంటర్‌లో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మూల మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పటాకులు పేల్చి, స్వీట్లు పంచారు. కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ జయశ్రీ, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఐలయ్య, ఎంపీటీసీ గోపాల్, మంగీలాల్, నాయకులు రెంటాల బుచ్చిరెడ్డి, రాసమళ్ల నాగేశ్వర్‌రావు, పగడాల శ్రీను, శ్రీకాంత్, సోమిరెడ్డి, రామ్మూర్తి, కృష్ణ, శ్రీను, నారాయణ, బాబా, లింగయ్య పాల్గ్గొన్నారు.

గార్ల రూరల్: కోరం కనకయ్యకు టికెట్ కేటాయింపుపై మండలంలోని టీఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గార్ల నెహ్రూసెంటర్‌లో పటాకులు కాల్చి సంబురాలు జరిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ వెంకట్‌లాల్‌నాయక్, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా నాగేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్ గార్ల మండలాధ్యక్షుడు వడ్లముడి దుర్గాప్రసాద్, నాయకులు సిలివేరు శంకర్, శ్రీనివాసరెడ్డి, అశోక్, సంజీవరెడ్డి, కిషన్, శివాజీ, కోళ్ల కుమార్‌గౌడ్, నర్సయ్య, పందుల నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

167
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...