కొలువుదీరిన కొత్త అధికారులు


Fri,September 7, 2018 01:47 AM

-బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవో ఈశ్వరయ్య
-విధుల్లో చేరిన డీఎస్పీ మదన్‌లాల్
మహబూబాబాద్ ప్రజాప్రతినిధి, సెప్టెంబర్ 06 : తొర్రూరు రెవెన్యూ డివిజన్‌కు కేటాయించిన కొత్త అధికారులు గురువారం కొలువుదీరారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఖాళీగా ఉన్న తొర్రూరు ఆర్డీవో పోస్టు భర్తీ కాగా డీఎస్పీ పోస్టులో నూతన నియామకం జరిగింది. ఆర్డీవోగా టీ ఈశ్వరయ్య బాధ్యతల్లో చేరారు. జనగామ మున్సిపల్ చైర్మన్‌గా పని చేస్తున్న ఈశ్వరయ్య తొర్రూరు ఆర్డీవోగా బదిలీపై వచ్చారు. విధుల్లో చేరిన తర్వాత కలెక్టర్ శివలింగయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుత డీఎస్పీ జీ రాజారత్నం బదిలీ కావడంతో ఆయన స్థానంలో గుగులోత్ మదన్‌లాల్‌కు పోస్టింగ్ ఇవ్వడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన డీఎస్పీ మదన్‌లాల్‌కు రాజారత్నంతోపాటు సీఐ వీ చేరాలు, ఎస్‌ఐలు పుష్పగుచ్ఛాలను అందజేసి స్వాగతం పలికారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...