ఎన్‌సీఎస్‌సీపై 8న అవగాహన, శిక్షణ


Fri,September 7, 2018 01:47 AM

మహబూబాబాద్ టౌన్, సెప్టెంబర్ 06: ఇరవై ఆరవ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ (ఎన్‌సీఎస్‌సీ) జిల్లాస్థాయి ప్రాజెక్టుల పోటీల్లో భాగంగా ప్రాజెక్టులు రూపొందించేలా విద్యార్థులను సన్నద్ధం చేయడానికి మార్గదర్శక ఉపాధ్యాయులకు ఒక రోజు శిక్షణ ఉంటుందన్నారు. ఈ నెల 8న మహబూబాబాద్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు)లో శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎన్‌సీఎస్‌సీ కోఆర్డినేటర్ వీ గురునాథరావు, డీఈవో సత్యప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేబీజీవీ, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాలలకు చెందిన ఒక సైన్స్ ఉపాధ్యాయుడు హాజరుకావాలని సూచించారు. 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్‌కు చెందిన ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు తొర్రూరు రెవెన్యూ డివిజన్‌కు చెందిన ఉపాధ్యాయులకు ఈ శిక్షణ నిర్వహిస్తారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల నుంచి ఒక సైన్స్ (భౌతిక / జీవశాస్త్ర) ఉపాధ్యాయుడిని ఈకార్యక్రమానికి పంపాలని కోరారు. వివరాలకు 9866549297, 9440849587 నంబర్లలో సంప్రదించవచ్చని, గురునాథరావు, డీఈవో సూచిచారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...