శంకర్‌నాయక్‌తోనే అభివృద్ధి: ఎంపీపీ


Fri,September 7, 2018 01:47 AM

కేసముద్రం రూరల్: తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌తోనే మానుకోట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎంపీపీ కదిరె రాధిక అన్నారు. ఇనుగుర్తి వద్దిరాజు ఘాట్ నుంచి కట్టుకలువతండా వరకు, వీరారెడ్డిపల్లి నుంచి ఏడుగుడిసెలతండా వరకు ఐటీడీఏ రూ. 2.23 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్ల నిర్మాణాలకు ఎంపీపీ, జెడ్పీటీసీ పద్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందన్నారు. మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమం లో టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రావుల శ్రీనాథ్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బండారు వెంకన్న, మాజీ జెడ్పీటీసీ కదిరె సురేందర్, మాజీ ఎంపీటీసీ దీకొండ వెంకన్న, టీఆర్‌ఎస్ నాయకులు మామిడి శోభన్, గండు నాగన్న, సట్ల భిక్షపతి, మంగ్యానాయక్, శ్రీనివాస్ పింగిళి, మార్క సారయ్య, ఎంపీడీవో అరుణాదేవి పాల్గొన్నారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...