సస్యశ్యామలంగా పాలమూరు


Thu,September 6, 2018 02:27 AM

-7 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చాం..
- పాలమూరు ప్రాజెక్టుతో కరువు శాశ్వతంగా దూరం
-నాలుగేళ్లల్లోనే గుణాత్మకమైన మార్పులు
- ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న కేసీఆర్
- రూ.324 కోట్లతో జిల్లాలో అభివృద్ధి
- కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట మునిగినట్లే..
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
- ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలవాలి : ఎంపీ జితేందర్‌రెడ్డి
- దివిటిపల్లిలో డబుల్‌బెడ్రూంలు ప్రారంభం
-పాలు పొంగించిన మంత్రి కేటీఆర్
-హాజరైన మంత్రి లకా్ష్మరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి


మహబూబ్‌నగర్,నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : 7లక్షల ఎక రాలకు సాగునీరు అందించి పాల మూరును సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని మంత్రి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని ఆరు కోట్లతో డీఈవో కార్యాలయం, తెలంగాణ చౌర స్తా కూడళ్లలో రోడ్ల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 3 కోట్లతో పట్టణంలో మోడల్ కూరగాయల మార్కెట్ కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగులకు 1500 పింఛ న్, ఆహార భద్రత కార్డు ద్వారా ప్రతి వ్యక్తికి 6 కేజీల బియ్యం, బడిలో సన్నబియ్యం బోజనం, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, అమ్మఒడి, ఒక్కొక్క పేద విద్యార్థికి లక్షా20 వేలు ఖర్చు చేస్తూ గురుకుల విద్యలాంటి పథకాలను అమలు చేయడం వల్ల పేద ప్రజల సంక్షేమంలో మార్పు లు చోటు చేసుకున్నాయన్నారు. 60 ఏళ్లపాటు ప్రజలు అధికారం అప్పగిస్తే.. గోల్‌మాల్ చేసిన కాంగ్రెస్‌ను ఎట్టి పరిస్థితిలో నూ నమ్మవద్దని మంత్రి పేర్కొన్నారు. అనంతరం దివిటిపల్లిలో నిర్మాణమైన 1024 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్, మంత్రి లకా్ష్మరెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌ల సమక్షంలో ప్రారంభోత్సవం చేశా రు. ఈ సందర్భంగా రెండు చోట్ల వేర్వేరుగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలతో ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నదన్నారు. టీఆర్‌ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నప్పటికి వారిని గందరగోళ పరిచే కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రజలకు ఎలాంటి సేవ చేయాలన్న ఆలోచన లేకుండా కేవలం అధికారం అనుభవించడానికి మాత్రమే కాంగ్రెస్ ఆశపడుతున్నదన్నారు.గోల్‌మాల్ కాంగ్రెస్‌ను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోను నమ్మొద్దని, వాళ్లను నమ్మితే మోసం చేయ డం తప్పా మరొకటి లేదన్నారు. మహిళా సంఘాలకు ఇటీవల డబ్బులు విడుదల చేయడం జరిగిందని, ఇంకాను ఏమైన బకాయిలున్నా పూర్తిగా చెల్లిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. మహిళల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పాలనలో కరంట్ ఉంటే వార్త, నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కరంట్ పోతే వార్తలా ఉందన్నారు. ఒక్క మహబూబ్‌నగర్‌లోనే 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. వాటితో పాటు మరో 324 కోట్లతో జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎలాంటి పైరవీలకు తావులేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. మహబూబ్‌నగర్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పులిబిడ్డలా గర్జిస్తాడన్నారు. ఎప్పుడు హైదరాబాద్‌లో ఉంటా డో, ఎప్పుడు మహబూబ్‌నగర్‌లో ఉంటాడో ఆశ్చర్యగా ఉంటుందన్నారు. ప్రతి మంత్రి దగ్గరకు వెళ్లి కావల్సిన పనులన్నిటిని మరీ వెంటబడి చేయించుకుంటాడన్నారు. ఎక్కడ ప్రజా సమస్యలుంటే అక్కడ ఎమ్మెల్యే వాలిపోతాడని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేకు కితాబిచ్చారు. మంచిగా పని చేస్తున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని మంత్రి కోరారు.

కేసీఆర్‌కు అండగా నిలవాలి : ఎంపీ జితేందర్ రెడ్డి

నాలుగేళ్లలోనే 60 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులు చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలవాలని ఎంపీ జితేందర్‌రెడ్డి కోరారు. గతంలో అధికారం చేపట్టిన పార్టీలు పేదలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. 14 ఏళ్ల పోరాటంతో సొంత రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, అదే ఉద్యమ స్ఫూర్తితో నేడు రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. ఇటీవల చేపట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు ఎనలేని ఆదరణ పొం దుతున్నాయన్నారు. పెట్టుబడుల పథకం ద్వారా ఎకరాకు 8 వేల రూపాయలను అందిస్తున్న సీఎం రైతు పక్షపాతిగా నిలిచాడని ఎంపీ అన్నారు.

ఎన్నిశక్తులు ఏకమైనా సీఎం కేసీఆర్‌ను ఏమీ చేయలేరు : ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్

ఎన్ని శక్తులు ఏకమైనా సీఎం కేసీఆర్‌ను ఏమీ చేయలేరని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఊహించని రీతిలో అభివృద్ధి పనులు చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలంతా ఆదరణతో ఉన్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా ప్రభుత్వం ద్వారా ఏదో ఒక లబ్ధిపొందడం జరిగిందన్నారు. శ్మశానాలకు కూడా స్థలాలను కేటాయించుకోలేని దుస్థితి నుంచి కోట్లాది రూపాయలతో పట్టణాన్ని సుందరంగా చేసుకునే పనులను నేడు చేయిస్తున్నామన్నారు. దుర్గంధం వెదజల్లే పెద్ద చెరువు అభివృద్ధి, డబుల్ బెడ్రూంలు, మయూరి పార్కులాంటి అనేక కొత్త వసతులను సమకూర్చుకున్నామన్నారు. నేటి టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, కాని ప్రతిపక్ష నాయకులు మాత్రం సంతోషంగా లేరన్నారు. కేవలం సీఎంగా కేసీఆర్ ఉన్నందువల్లే పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

నాలుగేళ్లుగా పేద ప్రజల అభివృద్ధే ప్రధానంగా పాలన సాగిస్తున్న తీరును ప్రజలంతా గ్రహించాలన్నారు. ప్రాజెక్టుల సాగునీటితో పంటలు పండుతున్నాయన్నారు. ఏమాత్రం తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని మరో 20 ఏళ్లపాటు టీఆర్‌ఎస్ అధికారంలో ఉంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. వచ్చే రోజుల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టాలని, మరిన్ని సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వానికి తోడ్పాటునందించాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్, జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, షాప్ చైర్మన్ అల్లీపూర్ వెంకటేశ్వర్ రెడ్డి, స్టేట్ కో ఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప,రాష్ట్ర ఫుడ్ కమిటీ సభ్యురాలు శారద, మున్సిపల్ చైర్మన్ రాధా అమర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, సింగిల్ విండో చైర్మన్ కోరమోని వెంకటయ్య, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, నాయకులు బెక్కెం జనార్దన్, సురేందర్ రెడ్డి, శివరాజ్, మక్సూద్, సుధీప్‌రెడ్డి పాల్గొన్నారు.

162
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...